టాలీవుడ్ లో మారుతి డైరెక్ట్ చేసిన 'ఈరోజుల్లో' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది రేష్మా రాథోర్. ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించినప్పటికీ హీరోయిన్ గా బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో సినిమాలకు దూరమై రీసెంట్ గా రాజకీయాల్లో చేరింది.

బీజేపీ పార్టీలో చేరిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. వైరా నియోజవర్గం నుండి ఎమ్మెల్యే స్థానం కోసం బరిలోకి దిగింది. సింగరేణి కార్మికులు ఓటర్లుగా ఉండే నియోజకవర్గంలో తాను గెలుస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది ఈ నటి.

డబ్బు సంపాదించుకోవాలని ఉంటే వేరే పనులు చేసుకునేదాన్నని, ప్రజలకి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. బీజేపీ తరఫున అసెంబ్లీలో ప్రజావాణి వినిపిస్తానని ఎంతో నమ్మకంతో కామెంట్స్ చేసింది.

అంతేకాదు.. త్వరలోనే శ్యామ ప్రసాద్ ముఖర్జీ జీవితం ఆధారంగా వస్తోన్న సినిమాలో అతడి భార్య పాత్రలో నటిస్తున్నట్లు.. ఆ సినిమా ఓపెనింగ్ కి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా క్లాప్ కొడతారని గొప్పగా చెప్పుకుంటోంది. మరి తాను అనుకుంటున్నట్లు ఎమ్మెల్యే పదవిని దక్కిన్చుకుంటుందో లేదో చూడాలి! 

ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న హీరోయిన్!