'ఈరోజుల్లో' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేష్మ ఇప్పుడు పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి దిగింది. ఇదివరకే బీజేపీ పార్టీలో చేరిన ఆమె వచ్చే ఏడాది ఎన్నికల్లో బీజేపీ తరఫున ఖమ్మం జిల్లాలోని వైరా నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుంది.

'బాడీగార్డ్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ సినిమాలో హీరోయిన్ త్రిష స్నేహితుల్లో ఒకరిగా రేష్మ కనిపించింది. ఆ తరువాత హీరోయిన్ గా నటించిన 'ఈరోజుల్లో' సినిమాతో అమ్మడుకి టాలీవుడ్ లో గుర్తింపు లభించింది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి యూత్ లో ఆదరణ లభించింది.

ఆ తరువాత ఎన్ని సినిమాలలో నటించినా రేష్మకి బ్రేక్ మాత్రం దక్కలేదు. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. నటిగా లాభం లేదనుకుందో ఏమో రాజకీయాల్లోకి వచ్చింది. బీజేపీ పార్టీలో చేరి ఇప్పుడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. 

త్వరలోనే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టబోతుంది. మరి ఎన్నికల్లో ఈ హీరోయిన్ గెలుస్తుందో లేదో చూడాలి!