Asianet News TeluguAsianet News Telugu

సాయి తేజ్ 'రిపబ్లిక్‌' ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్


'ప్రస్థానం', 'ఆటోనగర్‌ సూర్య' సినిమాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన దేవా కట్ట రిపబ్లిక్‌కు దర్శకుడిగా వ్యవహరించాడు. ఇందులో సీనియర్‌ నటి రమ్యకృష్ణ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించగా ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌గా నటించింది. 

Republics OTT Release Date Made Official
Author
Hyderabad, First Published Nov 2, 2021, 8:25 AM IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా తెరకెక్కించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు దీనికి మిక్సెడ్ టాక్ వచ్చింది. సినిమా బాగుంది కానీ చివర్లో హీరో చనిపోవడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. రివ్యూస్ కూడా కొంచెం అటూ ఇటూగానే వచ్చాయి. దాంతో చాలా మంది థియోటర్ లో చూద్దామనుకున్నా వెనకడుగు వేసారు. ఓటీటి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో సినిమా రిలీజ్ అయ్యి నెల కావటంతో రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించారు.

  'రిపబ్లిక్‌' చిత్రాన్ని జీ5 లో నవంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాకు  సాయి ధరమ్ తేజ్ గత సినిమాలతో పోలిస్తే రిపబ్లిక్ సినిమాకు చాలా తక్కువ వసూళ్ళు వచ్చాయి.  సాయి సినిమాకు తొలిరోజు వచ్చే కలెక్షన్స్.. ఇప్పుడు రిపబ్లిక్ సినిమాకి రావటానికి నాలుగు రోజులు పట్టింది.  సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించినా కూడా నెగిటివ్ క్లైమాక్స్ వసూళ్ళపై దారుణమైన ప్రభావం చూపించింది.  
 
'ప్రస్థానం', 'ఆటోనగర్‌ సూర్య' సినిమాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన దేవా కట్ట రిపబ్లిక్‌కు దర్శకుడిగా వ్యవహరించాడు. ఇందులో సీనియర్‌ నటి రమ్యకృష్ణ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించగా ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం జూన్‌ 4న రిలీజ్‌ చేయాలనుకున్నారు, కానీ కరోనా కారణంగా రిలీజ్‌ వాయిదా వేశారు. అయితే కొన్ని ఓటీటీ సంస్థలు మంచి ఆఫర్‌ను అందిస్తుండటంతో వాటితో డీల్‌ కుదుర్చుకునే దిశగా చర్చలు నడిచాయి.కానీ అవన్నీ ప్రక్కన పెట్టేసి థియోటర్ వైపే ప్రయాణం పెట్టుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. అప్పుడే ఓటీటిలో వచ్చేసి ఉంటే బాగుండేది అని చాలా మంది అన్నారు.

Also read RRR glimpse: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, అజయ్‌ దేవగన్, అలియాలతో వర్క్ చేయడంపై రాజమౌళి హాట్‌ కామెంట్‌
 
భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగులు, కోర్టుల నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించారు. ఇందులో పంజా అభిరామ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను సాయితేజ్ పోషించాడు. విశేషం ఏమంటే తన ఇంటిపేరును తొలిసారి సాయితేజ్ తన పాత్రకు పెట్టుకున్నాడు. ఇంతవరకూ తాను పోషించిన పాత్రలలో పంజా అభిరామ్ అత్యంత ఇష్టమైనదని తేజ్ చెబుతున్నాడు. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. 

Also read Puneeth rajkumar: పునీత్ కళ్ళతో నలుగురి కంటి చూపు, మిగిలిన భాగంతో మూలకణాల ఉత్పత్తి!

Follow Us:
Download App:
  • android
  • ios