పవన్(Pawan kalyan) మొదటగా తన స్పీచ్ లో సాయి ధరమ్ ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. మా అక్క కొడుకు అయిన్నప్పటికీ నేను సాయి ధరమ్ కి నేను ఇచ్చిన సపోర్ట్ చాలా తక్కువ అన్నారు. 


సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్. అక్టోబర్ 1న గ్రాండ్ గా విడుదల కానుండగా నేడు ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ హాల్ లో సాయంత్రం ఆరు గంటలకు వేడుక మొదలైంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తుండగా, ఫ్యాన్స్ తో వేదిక సందడిగా మారింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


అదే సమయంలో ఏపీలో సినిమా టికెట్స్ రేట్లు, ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలు విషయంలో సీఎం జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ సాగే అవకాశం కలదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. కాగా పవన్ మొదటగా తన స్పీచ్ లో సాయి ధరమ్ ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. మా అక్క కొడుకు అయిన్నప్పటికీ నేను సాయి ధరమ్ కి నేను ఇచ్చిన సపోర్ట్ చాలా తక్కువ అన్నారు. దానికి కారణం మెగా హీరోలు ఎవరైనా కుటుంబంపై ఆధార పడకూడదు. స్వశక్తితో ఎదగాలి. గోకులంలో సీత సినిమా వరకు కూడా నేను అన్నయ్య చిరంజీవి సపోర్ట్ తీసుకోలేదు.


సాయి ధరమ్ కి మొదటి నుండి అవకాశాలు అలాగే వస్తున్నాయి. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి కారణం, సినిమా విడుదల అవుతున్న సమయంలో దర్శక నిర్మాతల సంతోషం దూరం అయ్యింది. సాయి ధరమ్ కి బైక్ యాక్సిడెంట్ జరిగి ప్రమోషన్స్ కి దూరం అయ్యాడు. అందుకే ఈ సినిమాకు సప్పోర్ట్ గా నేను ఈవెంట్ కి వచ్చాను అన్నారు. ఇక సాయి ధరమ్ అతి వేగం కారణంగానే బైక్ యాక్సిడెంట్ కి గురయ్యారని కొందరు మాట్లాడడం బాధకలిగించింది. అలా మాట్లాడిన వారి కుటుంబాలలో కూడా ఇలా జరిగితే అప్పుడు తెలుస్తుంది. ఏం మీకు మాత్రం జరగదా.. అంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.