పవన్‌, లెజినోవా మధ్యలో అకీరా : రేణు ట్వీట్‌

Renudesai tweet on akira meeting pawan
Highlights

పవన్‌, లెజినోవా మధ్యలో అకీరా : రేణు ట్వీట్‌

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో అద్దె ఇంట్లోకి దిగిన సంగతి తెలిసిందే. భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరాలతో కలసి ఆయన శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. ఈ క్రమంలో తండ్రి వద్దకు కుమారుడు వచ్చిన విషయంపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు.

"స్కూలు సెలవులను గడపడానికే తండ్రి వద్దకు అకీరా వచ్చాడు. అకీరా హైదరాబాదుకు షిఫ్ట్ కాలేదు. పవన్ తో కలసి అకీరా కనిపించడంతో... నిన్నటి నుంచి నాకు వరుసగా మెసేజ్ లు వస్తున్నాయి. ఆ మెసేజ్ లకు సమాధానంగానే నేను ఈ క్లారిటీ ఇస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.

loader