సమాజంలో మార్పుకోసం రేణు, పవన్ ప్రయత్నిస్తున్నారా?

సమాజంలో మార్పుకోసం రేణు, పవన్ ప్రయత్నిస్తున్నారా?

ఇటీవలే బుల్లితెర ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయి మీతోనే డ్యాన్స్ కార్యక్రమం ద్వారా తెలుగు లోగిళ్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రజ్యోతి సీఎండీ రాధాకృష్ణతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో రేణు పాల్గొంది. తాజాగా అనేక విషయాలను వెల్లడించింది. రెండో పెళ్లి గురించి ఆర్కే అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న తనను చేసుకోవాలంటే ఎంతో మంచి మనసు ఉండాలని అన్నారు.

 

ప్రస్తుతం తనను ఓ సాధారణ మహిళగా కాకుండా పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే చూస్తున్నారని, అందుకే ఎవరూ ముందుకు రారని అభిప్రాయ పడింది రేణు దేశాయి. సినిమా వాళ్లకు చాలా మందితో ఎఫైర్లు ఉన్నాయని, వారి ప్రవర్తన సరిగా ఉండదనే బలమైన ముద్ర చాలా మంది మనసులో ఉంటుంది. కానీ ఇలాంటి విషయాలను పక్కనబెట్టి..  తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వచ్చాడంటే ఆయన ఖచ్చితంగా మహానుబావుడేనని రేణు చెప్పుకొచ్చారు.
 

తనకు బంధువులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, మరోసారి ప్రేమ అనే జోలికి వెళ్లనని అన్నారు. రెండో పెళ్లి గురించి ఫేస్‌బుక్‌లో పవన్ అభిమాని.. మీరు పెళ్లి చేసుకునే వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికేస్తామని బెదిరించారని, అది చదివిన నాకు చాలా భయమేసిందని రేణూ పేర్కొన్నారు. మీకెందుకు పెళ్లి అవసరం, ఇద్దరు పిల్లలున్నారు వారిని చూసుకోవచ్చు కదా అని కొందరు సలహా ఇచ్చారని తెలిపారు.

 

అయితే తన కొడుకు అకీరా కూడా పెళ్లిచేసుకోవచ్చు కదా అని అడుగుతున్నాడని, నన్ను వివాహం చేసుకోడానికి ఎవరు ముందుకొస్తారో చూడాలని రేణు అన్నారు. ఇక పవన్ కల్యాణ్ ఇటీవలే మరోసారి తండ్రి అయిన సందర్భంలో... పవన్ కు ఫోన్ చేసి, శుభాకాంక్షలు తెలిపానని రేణు దేశాయ్ తెలిపారు. తల్లీ, కుమారుడు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించానని చెప్పారు. అంతేకాదు రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్న తనకు పవన్ కొన్ని సూచనలు కూడా చేశారని తెలిపారు. చేసుకోబోయే వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఎలాంటిదో తెలుసుకుని ముందడుగు వేయాలని పవన్ సలహా ఇచ్చారన్నారు. మన సమాజంలో మార్పు రావాలని ఆయన ఎప్పుడూ కోరుకుంటారని అన్నారు.తమ పిల్లలు ఎవరి వద్ద ఉండాలనే విషయంపై చర్చ తమ మధ్య ఎన్నడూ రాలేదని రేణు తెలిపారు. ఒక భార్యగా, ఒక వ్యక్తిగా తనను పవన్ ఎలా గుర్తించారన్నది తనకు అర్థంకాలేదని.. పిల్లలకు ఒక తల్లిగా మాత్రం ఆయన తనను చాలా గొప్పగా భావిస్తారని అన్నారు. విడాకుల సమయంలో పవన్ కల్యాణ్ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాననే విషయంలో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. ఈ విషయం గురించి మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ ఒకాయన అడిగినప్పుడు చాలా బాధపడ్డానని స్పష్టం చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page