పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో సంచలన అయింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు ఒక కవితలాగా అనిపించాయి.   అయితే ఆమె చెప్పిన ఆ కవితలో చాలా అర్థాలు వెతుక్కుంటున్నారు అభిమానులు. అతడి జ్ఞాపకాలు, ముక్కలైన నా హృదయం సమాధి కాబడ్డ నా జ్ఞాపకాలను మళ్లీ వెలికి తీశాను. ఆయన మాటలు, కొన్ని పదాలు, అతడి పేరు ఒక కలం అందులో కనిపించాయి.. అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఒక స్ప్రింగ్ బలవంతంగా చెర్రీ చెట్లను వికసింపజేసినట్లు...కమ్ముకున్న మంచు కరిగిపోయి సమాధి కాబడ్డ ఆ జ్ఞాపకాలు మళ్లీ నాకు గుర్తుకు వస్తున్నాయి..అని రేణు దేశాయ్ చెప్పే ప్రయత్నం చేశారు.విధి ఎంత బలీయం. మనసు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాపకాలన్నింటినీ మళ్లీ గుర్తు చేసింది. ఆ జ్ఞాపకాలను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు పట్టిన కలం, దానిపై రాసున్న పేరు చెరిగిపోయి ఉంది. ముక్కలైన నా హృదయం, నేను రాసుకున్న లేఖల కాగితపు ముక్కలు కనిపించాయి..... అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.సమాధి కాబడ్డ ఆ జ్ఞాపకాలు అన్నీ కూడా ఇపుడు ఎంతో విషాదంగా కనిపిస్తున్నాయి.... అని రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు.
రేణు దేశాయ్ ఎవరిని ఉద్దేశించి ఈ కవిత రాశారు? తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారా? లేక ఇంకెవరి గురించి అయినా గుర్తు చేసుకున్నారా? లేదా రచయితగా తన టాలెంటుకు పదును పెట్టుకోవడంలో భాగంగా ఆమె దీన్ని రాశారా? అనేది తెలియాల్సి ఉంది.