ఈసారి కూడా రేణు పెళ్లి అలానే జరగబోతుందా..?

renu desai second marriage in the presence of akira and adhya
Highlights

నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇప్పుడు మరొకరిని వివాహం చేసుకోవడానికి 

నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇప్పుడు మరొకరిని వివాహం చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఈ విషయం బయటకి తెలిసిన తరువాత సోషల్ మీడియాలో రేణుని విమర్శిస్తూ నెటిజన్లు చాలా కామెంట్స్ చేశారు.

దీంతో ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేసేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రేణు పెళ్లి ఎలా జరగబోతుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆమె పెళ్లికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లల సమక్షంలోనే పెళ్లికి సిద్ధమవుతోంది. రేణు మొదటి పెళ్లి కూడా ఇలానే జరిగింది. పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ చాలా కాలం పాటు సహజీవనం చేశారు.

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ బాధ్యతలు కొన్ని తన మీద వేసుకున్నాడో.. అప్పుడు విమర్శలకు ఛాన్స్ ఇవ్వకూడదని రేణుదేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే వారికి అకీరా పుట్టేశాడు. రేణు-పవన్ ల పెళ్లి జరిగే సమయానికి అకీరా వయసు ఐదేళ్లు. ఆ తరువాత వీరిద్దరి విడిపోయిన సంగతి తెలిసిందే. పవన్ మరో పెళ్లి  కూడా చేసుకున్నాడు. ఇప్పుడు రేణు కూడా ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోనుంది. ఈసారి అకీరా, ఆద్యల సమక్షంలో రేణు పెళ్లి చేసుకోనుండడం విశేషమనే చెప్పాలి. 

loader