పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి' సినిమాలో నటించి తెలుగువారికి దగ్గరైంది రేణుదేశాయ్. ఆ తరువాత 'జానీ' సినిమాలో దర్శనమిచ్చింది. టాలీవుడ్ లో ఆమె ఫిలిం కెరీర్ చెప్పుకోదగ్గ విధంగా ఏంలేనప్పటికీ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని పాపులారిటీ దక్కించుకుంది.

సినిమాలకు దూరమైన ఈ నటి అప్పుడప్పుడు తన కవితలతో అభిమానులను పలకరించేది. పవన్ కి దూరమైన తరువాత మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది రేణుదేశాయ్. ప్రొఫెషనల్ గా కూడా సెటిల్ అవ్వాలని చూస్తోంది.

ఈ క్రమంలో ఓ యాడ్ లో నటించడానికి అంగీకరించింది. కళామందిర్ కళ్యాణ్ 'కాంచీపురం వరమహలక్ష్మి సిల్క్స్' కి రేణుదేశాయ్ ని బ్రాండ్ గా ఎంపిక చేసుకొని ఆమెతో ఇటీవల ఓ యాడ్ ఫిల్మ్ ని చిత్రీకరించారు. 

రేణుదేశాయ్ మొదటి బ్రాండ్ ఎండోర్స్ ఇదేనని చెప్పాలి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి భవిష్యత్తుల్లో ఇంకెన్ని యాడ్స్ లో నటిస్తుందో చూడాలి!