పవన్ కి దొరక్కుండా రేణుదేశాయ్ ప్లాన్!

renu desai marriage plans
Highlights

పవన్ కళ్యాణ్ నటించిన 'బద్రి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రేణుదేశాయ్. ఆ తరువాత పవన్ ను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకు దూరమయ్యారు. విడాకుల తరువాత తన మాతృభాష మరాఠీలో ఓ సినిమా అలానే దర్శకురాలిగా మరో సినిమా చేశారు. 

పవన్ కళ్యాణ్ నటించిన 'బద్రి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రేణుదేశాయ్. ఆ తరువాత పవన్ ను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకు దూరమయ్యారు. విడాకుల తరువాత తన మాతృభాష మరాఠీలో ఓ సినిమా అలానే దర్శకురాలిగా మరో సినిమా చేశారు. త్వరలోనే తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ హీరో సినిమాలో ఆమె నటించబోతుందనే వార్తలు ఖండించింది.

ప్రస్తుతం ఆమె దర్శకురాలిగా రైతు సమస్యలపై సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. కథ, కథనం పూర్తయ్యాయని ప్రస్తుతం సినిమా డైలాగులు రాస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుండి సినిమా షూటింగ్ ఉంటుందట. ఈలోగా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. సినిమా అంటే మీడియా ముందు రావాలి.. రెండో పెళ్లికి ముందు మీడియా ముందుకు వస్తే ఆమెకు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయి.

అందుకే సినిమా మొదలుపెట్టడానికి ముందే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఆ తరువాత కొత్త జీవితంలోకి అడుగుపెట్టానని పాత జ్ఞాపకాల గురించి అడగొద్దని మీడియాను రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆ విధంగా పవన్ ప్రశ్నల నుండి తప్పించుకోవాలని భావిస్తోంది. కానీ ఆమె ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది చెప్పలేని పరిస్థితి. 

loader