పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో వివాహానికి సిద్ధం అవుతోంది. గత ఏడాది రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగింది. కాబోయో భర్త ఫోటోలని, వివరాలని మాత్రం రేణు దేశాయ్ బయటపెట్టకుండా గోప్యంగా ఉంచింది. నిశ్చితార్థం జరిగి చాలా కాలం గడచినా వివాహం ఊసే లేదు. దీనితో రేణు దేశాయ్ రెండో వివాహం ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో కొందరు అనవసరమైన పుకార్లు సృష్టించారు. 

ఆ మధ్యన అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న రేణు దేశాయ్ రెండో వివాహం గురించి క్లారిటీ ఇచ్చింది. పెళ్లి పనులు జరుగుతున్నాయని తెలిపింది. తాజాగా తన రెండో వివాహం గురించి లేనిపోని రూమర్లు క్రియేట్ చేస్తున్నవారికి చెక్ పెట్టేలా రెండు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. సూర్యుడి వెలుతురులో చిరునవ్వుతో ఉన్న ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

ఈ ఫోటోని తన కాబోయే భర్తే క్లిక్ మనిపించినట్లు రేణు దేశాయ్ తెలిపింది. 'ఫియాన్సీ గారికి థాంక్స్' అంటూ కామెంట్ పెట్టింది. బిగ్ బాస్ 3 విషయంలో కూడా రేణుదేశాయ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాను. అవకాశం ఉంటే హోస్ట్ గా చేయాలని ఉన్నట్లు రేణుదేశాయ్ తెలిపింది.