తన గురించి వస్తున్న ఎన్నో ఊహాగానాలు, ట్రోలింగ్స్ పై రేణు దేశాయ్ నిత్యం స్పందిస్తూనే ఉన్నారు. ప్రతి విషయంలో తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో ముడిపెడుతూ ఉండడం రేణు దేశాయ్ కు నచ్చడం లేదు. ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందరు మంచి తండ్రులకు, సింగిల్ గా ఉంటున్న తల్లులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. 

ఈ పోస్ట్ లో తన కురుడు అకీరా, కుమార్తె ఆద్యతో ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఈ పోస్ట్ పై పవన్ కళ్యాణ్ పిల్లలతో ఉన్న రేణు దేశాయ్ అంటూ ఓ వెబ్ సైట్ కథనం రాసింది. దీనిని కూడా పవన్ కళ్యాన్ తో ముడిపెట్టడంపై రేణు దేశాయ్ ఆగ్రహం చెందారు. ఈ వార్త రాసిన వ్యక్తి కూడా ఓ తల్లికే పుట్టుంటారు. తల్లిని ఎప్పుడూ భాదపెట్టకూడదు అని రేణు దేశాయ్ చురకలంటించింది. 

రేణు దేశాయ్ ప్రస్తుతం రచయితగా, దర్శకురాలిగా సినిమాలు చేస్తున్నారు. ఆమెకు బిగ్ బాస్3 లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చినట్లు కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే తాను కంటెస్టెంట్ గా పాల్గొననని, హోస్ట్ గా అవకాశం వస్తే చేస్తానని రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.