ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్లు రీఎంట్రీ ఇస్తూ.. అక్క, వదిన, తల్లి పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణుదేశాయ్ కూడా సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది. హీరోయిన్ గా టాలీవుడ్ లో రెండు సినిమాలే చేసినప్పటికీ పవన్ భార్యగా బాగా ఫేమస్ అయింది రేణు.

అయితే పవన్ కి విడాకులిచ్చి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది. అలానే సినిమాల్లో కూడా తన సత్తా చాటాలని నిర్ణయించుకుందట. ఈ క్రమంలో నటిగా రీఎంట్రీ ఇవ్వబోతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'దొంగాట' ఫేం దర్శకుడు వంశీకృష్ణ ఓ సినిమా రూపొందించబోతున్నారు.

స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను  రూపొందించనున్నారు. ముందుగా రానా హీరోగా ఈ సినిమా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ బెల్లంకొండ దగ్గరకి వెళ్లింది. ఈ సినిమాతోనే రేణు మళ్లీ సినిమాల్లోకి రాబోతుంది.

కథ ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ కి అక్క పాత్రలో కనిపించనుంది. మరి ఈ సినిమాతో నటిగా రేణు మరింత బిజీ అవుతుందేమో చూడాలి!