పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా ఆయన తనయుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు..? ఈ ప్రశ్నే ఎదురౌతుంది పవన్ ఫ్యాన్స్ నుంచీ.ఇక రీసెంట్ గా అకీరా బర్త్ డే సందర్భంగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పింది రేణు దేశాయ్.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా ఆయన తనయుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు..? ఈ ప్రశ్నే ఎదురౌతుంది పవన్ ఫ్యాన్స్ నుంచీ.ఇక రీసెంట్ గా అకీరా బర్త్ డే సందర్భంగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పింది రేణు దేశాయ్. 

మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు. వాళ్లంతా సరే.. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడంటూ ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది అకీరా నందన్ తల్లి రేణు దేశాయ్. అకీరా బర్త్ డే సందర్భంగా ఆమె స్పందించింది. 

View post on Instagram

అకీరా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు. తన ప్రతీ మూమెంట్ ను తన పేజ్ లో అప్ లోడ్ చేస్తుంటాడు. అటు రేణు దేశాయ్ కూడా తన పిల్లలకు సంబంధించి ప్రతీ అప్ డేట్ ను నెట్టింట్లో పంచకుంటుంది. ఇక రీసెంట్ గా అకీరా నందన్ పుట్టిన రోజు సందర్భంగా భారీ స్థాయిలో ఆయనకు ఫ్యాన్, సెలబ్రిటీస్ నుంచి శుభాకాంక్షలు అందాయి. ఇక వీటితో పాటు ఆయన హీరోగా ఎంట్రీ పై కూడా పలు ఊహాగానాలు ఊపు అందుకున్నాయి. వీటిపై రేణు స్పందించారు. 

అకీరా బాక్సింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న రేణు.. తన కొడుకుకి 18 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా అకీరా చాలా మంచి వాడని, తనకు తనయుడిగానే కాకుండా తమ్ముడిలా, స్నేహితుడిలా ఉంటూ గొప్పవాడు అని నిరూపించుకున్నాడన్నారు. అంతే కాదు అకీరా ఎంతో నిజాయితీ పరుడైన జెంటిల్ మెన్ అంటూ తన కొడుకుని పొగడ్తలతో ముంచెత్తారు రేణు. అంతే కాదు అకిరాకు విషెష్ తెలిపిన వారందరికి రేణు దేశాయ్ ధన్యవాదాలు తెలిపారు. 

ఇక అకీరా హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నాడు అన్న విషయంలో రేణు స్పందించారు. అకీరా బాక్సింగ్ ప్రాక్టీస్ హీరోగా మారేందుకే, త్వరలో అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నవారికి సమాధానం చెప్పింది రేణు. అకీరాకు నటుడు అయ్యే ఉద్ధ్యేశ్యం లేదని.. అతను ఏ సినిమాకు సైన్ చేయలేదని,అనవసరంగా అసత్యాలు ప్రచారం చేయవద్దంటూ రేణు క్లారిటీ ఇచ్చారు.