తెలుగులో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 3 మొదలుకానుంది. ఈ సీజన్ కోసం సెలబ్రిటీలను ఎంపిక చేయడం నిర్వాహకులకు చాలెంజింగ్ గా మారింది. సీజన్ 2లో పాల్గొన్న సెలబ్రిటీలను చూసి బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరిచారు. ఆ కారణంగానే ఇప్పుడు సెలబ్రిటీల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చైనా స్టార్స్ ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా బిగ్ బాస్ షోకి వెళ్లేవారికి రోజుకి ఇంత అనే లెక్కన ఇస్తారు. ఉదాహరణకి రోజుకి లక్ష రెమ్యునరేషన్ అనుకుంటే హౌస్ లో ఎన్ని రోజులుంటే అన్ని లక్షలు వారి పాకెట్ లోకి వెళ్తాయన్నమాట.

అయితే ఈసారి మాత్రం సెలబ్రిటీలు చాలా మంది రెమ్యునరేషన్ తో ప్యాకేజీ కూడా డిమాండ్  చేస్తున్నారట. అంటే రోజు ఇచ్చే రెమ్యునరేషన్ కాకుండా మరికొంత మొత్తాన్ని ప్యాకేజీ రూపంలో ఇవ్వాలని అడుగుతున్నారు. అలా చేస్తే రెమ్యునరేషన్ల కోసమే ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సి ఉంటుందని భయపడుతున్నారు నిర్వాహకులు.

అయితే ఈ విషయంలో సెలబ్రిటీలు మాత్రం తగ్గడం లేదట. షోలో పాల్గోన్ననంత మాత్రాన సినిమాలో అవకాశాలు రావని గత రెండు సీజన్ ల ద్వారా నిరూపితమైంది. ఆ కారణంగానే సెలబ్రిటీలు కూడా ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!