శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా , బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ `రెమో`. ఈ సినిమా ను నవంబర్ 25 న భారీ స్థాయి లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
రెమో చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు విడుదల చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U సర్టిఫికెట్ లభించింది. తమిళం లో 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడతారు అని చిత్ర బృందం ఆశిస్తోంది.
దిల్ రాజు మాట్లాడుతూ - ``హీరో శివకార్తికేయన్ రెమో సినిమాలో మూడు వేరియేషన్స్లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. పి.సి.శ్రీరాంగారి సినిమాటోగ్రఫీ, అనిరుధ్ సంగీతం సినిమాకు మరింత సపోర్ట్ చేశాయి. రెమో ష్యూర్ షాట్ హిట్ మూవీ అవుతుంది. రెమో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న శివకార్తికేయన్కు అభినందనలు. ఈ చిత్రాన్ని నవంబర్ 25 న విడుదల చేస్తున్నాం `` అన్నారు.
