ఆ సినిమాలు ఏమిటంటే..జాంబి రెడ్డి, రాధాకృష్ణ, బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, జర్నలిస్ట్, ప్రణవం, జీ-జాంబి, విఠల్ వాడి, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, జై మరియమ్మ సినిమలు రిలీజవుతున్నాయి. అయితే వీటిలో ఉన్నంతలో జాంబిరెడ్డినే క్రేజ్ ఉంది. మిగతా సినిమాలు అసలు రిలీజ్ అవుతున్న విషయం చాలా మందికి తెలియదు. ఇలా వరుసపెట్టి సినిమా విడుదలకావడం వున్న థియేటర్లను సర్దుకుపోవడం చాలా కాలంగా పిబ్రవరి నెలలో చాలా కామన్ విషయం గా మారింది. 

పిబ్రవరి నెల చిన్న సినిమాల నెల. వాస్తవానికి ఒకప్పుడు థియేటర్ల కొరత విపరీతంగా వుండేది. దాంతో కొందరు పెద్ద నిర్మాతలు థియేటర్లను కబ్జాచేస్తున్నారని అనేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్దితి లేదు. సినిమాలు రిలీజ్ చేసుకోవటానికి అనువుగా చాలా థియోటర్స్ ఉన్నాయి. అయితే ఈ సీజన్ లో సినిమాలు చూసే జనాలు తక్కువ. కాబట్టి అద్బుతం అంటే కానీ వర్కవుట్ కావు. మరి ఈ పది సినిమాల్లో ఏది నిలబడుతుందో చూడాలి. 
  
ఇక  డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ రూపొందిస్తోన్న మూడో చిత్రం 'జాంబీ రెడ్డి'తో తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ఫిబ్ర‌వ‌రి 5న 'జాంబీ రెడ్డి' థియేట‌ర్ల‌కు వ‌చ్చి, మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తాడు. ద‌య‌చేసి ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించి థియేట‌ర్ల‌కు రండి.  థియేట‌ర్ల‌లోనే ఫిల్మ్‌ను చూడండి." అని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.