బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ లు చాలా కామన్. ఇప్పటివరకు ప్రేమించుకొని విడిపోయిన సెలబ్రిటీలను చాలా మందినే చూశాం. ఈ లిస్ట్ లో అమితాబ్, రేఖలు కూడా ఉన్నారు. అప్పట్లో వీరిద్దరూ ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వలన విడిపోయారు.

ఆ తరువాత అమితాబ్ జయా బచ్చన్ ని వివాహం చేసుకొని పిల్లలు, మనవళ్లతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ రేఖ మాత్రం ఇప్పటికీ అమితాబ్ ని ఆరాధిస్తూనే ఉందని ఆమె మాటల ద్వారా అర్ధమవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేఖ.. తనకు అమితాబ్ కి మధ్య ఉన్న బంధం గురించి మాట్లాడింది.

అంత గొప్ప వ్యక్తిని.. స్వార్ధం లేకుండా నాలా ప్రేమించిన మరో వ్యక్తి లేరని అన్నారు. అమితాబ్ పై నాకు ఉన్నది ప్రేమ కాదు అంతకుమించి అంటూ చెప్పుకొచ్చింది. తమ మధ్య ఉన్న బంధానికి లవ్, ఎఫెక్షన్ అనే పదాలు సరిపోవని అన్నారు. ప్రస్తుతం అమితాబ్ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారని, ఆయన జీవితంలో చిచ్చు పెట్టాలనుకోవడం లేదని వెల్లడించింది.

ఎప్పుడు ఆయన సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకుంటానని తెలిపింది. ఇప్పటికీ ఏదైనా కార్యక్రమంలో కలుసుకుంటే ఒకరినొకరం పలకరించుకుంటామని చెప్పింది. ఇప్పటికీ ఆయనతో కలిసి నటిస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని, కానీ ఇప్పుడు మళ్లీ ఆయనతో నటించి దగ్గరవ్వడం ఇష్టం లేదని చెప్పింది. ఆమె మాటలను బట్టి ఇప్పటికీ రేఖ అమితాబ్ ని ఆరాధిస్తూనే ఉందని అర్ధమవుతోంది.