అనేక సక్సెస్ ఫుల్  చిత్రాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్టార్ ఇమేజ్ స్థాయిని అందుకోలేకపోయింది రెజినా. తెలుగులో సాయిధరమ్ యంగ్  హీరోలతో జత కట్టినా స్టార్ హీరోల సరసన ఛాన్స్  సాధించలేకపోయింది.

ఇక సౌత్ లో  లాభం లేదకుందో ఏమో కానీ ఈ భామ బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ఓ బోల్డ్  క్యారెక్టర్‌తో బాలీవుడ్‌లో దర్శనమిచ్చింది. అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఏక్‌ లడఖీ కో దేఖాతో ఐసా లగా’. ఈ చిత్రంలో రెజీనా లెస్బియన్‌ పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సోనమ్ కపూర్‌కు ప్రియిరాలుగా రెజీనా నటించారు. 

ఈనెల 1 న విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అయితే వచ్చాయి కానీ  ప్రేక్షకుల రివార్డులు మాత్రం దక్కటం లేదు . ఎంట్రీ లోనే బాలీవుడ్ లో తేజా కొట్టింది రెజీనా. అయితే ఈ సినిమాలో లెస్బియన్ గా  నటించటంతో బాలీవుడ్ అంతా ఆమె వైపు ఒక్కసారిగా చూసింది .   దాంతో గాల్లో తేలుతున్నట్లుంది రెజీనా. తను ఈ పాత్రని ఇష్టపడి చేసానంటూ...తనకు కొంతమంది హోమో సెక్సవల్ ఫ్రెండ్స్ ఉన్నారని, వారికి, నీతి సూత్రాలు చెప్పటం మానాలి, మార్పు రావాలి అంటోంది. 

ప్రధాన పాత్రలో సోనం కపూర్  నటించటంతో ఈ సినిమా రిలీజ్ కు ముందు క్రేజ్ తెచ్చుకుంది.  ఈ చిత్రంలో సోనం, రెజీనా లు లెస్బియన్ గా నటించి అదరకొట్టారని   ప్రముఖులు రెజీనా నటనపై ప్రశంసల జల్లు కురిపించారు.  అలా ఈ సినిమా విజయవంతం కానప్పటికి రెజీనా పాత్రకు మంచి పెరు వచ్చింది. దాంతో బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయని ఆమె భావిస్తోంది.