సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లగా'. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ప్రేమలో పడతారని టాక్. కథ ప్రకారం సినిమాలో సోనమ్ తండ్రి ఆమెకి పెళ్లి చేయడానికి పెళ్లికొడుకుని వెతుకుతుంటాడు. కానీ అప్పటికే ఆమె మరో హీరోయిన్ ని ప్రేమిస్తుంది.

సోనమ్ ప్రేమించే అమ్మాయి పాత్రలో సౌత్ హీరోయిన్ రెజీనా నటిస్తోంది. ట్రైలర్ లో కూడా రెజీనా కనిపించింది కానీ పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని డైరెక్టర్ రివీల్ చేయలేదు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ లతో బాలీవుడ్ సినిమాలు వచ్చాయి. ఇరవై ఏళ్ల క్రితం విడుదలైన 'ఫైర్' సినిమా దుమారం రేపింది.

మరి ఈసారి సోనమ్, రెజీనాల రొమాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. గత కొంతకాలంగా టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో తమిళంలో, హిందీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది రెజీనా.. మరి ఆమె నటించిన ఈ బాలీవుడ్ సినిమా ఆశించిన సక్సెస్ ని అందిస్తుందో లేదో చూడాలి!