హాట్ బ్యూటీ రెజీనా , సాయి తేజ  అప్పట్లో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే రెండు చిత్రాలు వరసపెట్టి చేసారు. అయితే వరసగా చేయటం వల్లనో , లేక మరెందుకో కానీ వీరిద్దరి మధ్యన సమ్ థింగ్..సమ్ థింగ్ అని మీడియాలో వార్తలు గుప్పు మన్నాయి. మీడియావారు వీళ్లిద్దరినీ డైరక్టర్ గా ఏం జరుగుతోందంటూ అడిగేసేవారు. దాని ఎఫెక్టో మరేమో కానీ ఆ తర్వాత వీళ్లు కలిసి పనిచేయలేదు.

తమ మధ్య స్నేహమే కానీ మరేమీ లేదని చెప్పేసారు. దాంతో వీళ్ల మీద మీడియా కాన్సర్టేషన్ తగ్గింది. అయితే రీసెంట్ గా సాయి తేజ చిత్రలహరితో ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. 

ఈ నేపధ్యంలో తన ప్రక్కన రెజీనాకు మరో అవకాసం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. ఈ మేరకు మారుతితో మాట్లాడి ఒప్పించేపనిలో ఉన్నాడని సమాచారం.  అయితే తను హీరోయిన్ పాత్ర ఇవ్వలేనని, స్పెషల్ రోల్ ఒకటి ఉందని చెప్పారట. అలా ఈ ప్రాజెక్టులోకి రెజీనా వస్తోందిట. మరైతే ఈ సారి కూడా రూమర్స్ వస్తాయి కదా అనుకుంటే ప్రొఫిషనల్ లైఫ్ లో ఇలాంటివన్నీ కామన్..పట్టించుకుంటే ముందుకు వెళ్లలేం ..లైట్ తీసుకోవాలని సాయి అన్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా ..రవితేజ హీరోగా తెరకెక్కిన నేల టిక్కెట్టు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ మాళవిక శర్మ ని ఎంపిక చేసినట్లు సమాచతారం. తొలి సినిమా డిజాస్టర్‌ కావటంతో ఈమెని పట్టించుకునే వాళ్లే లేరు. గీతా ఆర్ట్స్‌ 2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.