ఈ సంక్రాంతి పండక్కి 'రెడ్' సినిమాతో రామ్ థియేటర్లలోకి దూకుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుందని అఫీషియల్ గా ప్రకటించారు. గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షులను ఆకట్టుకున్నాడు హీరో రామ్.. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమాని చేసాడు. నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ వచ్చింది.  

  నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ‘ సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికేట్ వచ్చింది . 'దేవదాసు', 'మస్కా' తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో... ఈ అంశాలన్నీ సినిమాలోఉంటాయి. 'ఇస్మార్ట్ శంకర్'కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ.. 'రెడ్'కి కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. థియేటర్లలో సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో, ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం. ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తుందని అన్నారు. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రయిలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
 
 ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. తమిళ మూవీ 'తదమ్' స్టోరీ లైన్ ఆధారంగా తెరకెక్కుతున్నప్పటికి సినిమా కథ, కథనం మాత్రం చాలా కొత్తగా ఉంటాయని మేకర్స్ అంటున్నారు.. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత రామ్ మూవీ కావడం, మళ్ళీ ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ నేపధ్యంలో రామ్ కొత్త చిత్రం ‘రెడ్’ డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ మొదట అనుకున్నా..  ఎట్టి ప‌రిస్థితుల్లో త‌న సినిమాను థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేయాల‌ని రామ్ పట్టుబట్టి ఆపాడట‌.