ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ రెడ్. ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. తమిళ హిట్ చిత్రం తడమ్ కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం... సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న  ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.గతేడాది ఏప్రిల్ 9న సమ్మర్‌లో విడుదలకావాల్సిన ఈ సినిమా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడి దాదాపు పది నెలల తర్వాత థియేటర్స్‌లో విడుదలైంది. మధ్యలో ఈ సినిమాకు మంచి ఓటీటీ ఆఫర్స్ వచ్చినా.. అన్నింటినీ కాదని ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేయటంతో ఈ సినిమా కలెక్షన్స్ పై అందరి దృష్టీ ఉంది. 

ఈ నేపధ్యంలో నిర్మాతలే ఈ సినిమా తొలిరోజు షేర్ 6.7 కోట్లు వసూలు అయినట్లు పోస్టర్ విడుదల చేసారు. రామ్ ఈ పోస్టర్ ని తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో షేర్ చేసారు. అయితే ఈ సినిమాకు టాక్ బిలో యావరేజ్ గా ఉంది. సంక్రాంతి దాటాక ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయనే దాన్ని బట్టే ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాలో హీరో రామ్ తన కెరీర్‌లో తొలి సారి ద్విపాత్రాభినయం చేసాడు. రామ్‌తో పాటు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నివేదా థామస్, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌లు నటించారు.ఇస్మార్ట్ శంకర్ లాంటీ సినిమా తర్వాత రామ్ నుండి ఈ సినిమా రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి. 

ఇక  కోవిడ్ నేప‌థ్యంలో యాబై శాతం ఆక్యుపెన్సీతోనే థియేట‌ర్స్ ర‌న్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో సంక్రాంతి రేసులో నాలుగు సినిమాలు వ‌చ్చాయి. అందులో ముందుగా క్రాక్ విడుద‌లై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక మిగిలిన మూడు సినిమాల్లో భోగి పండుగ రోజు విజ‌య్ మాస్ట‌ర్ రిలీజైంది. సంక్రాంతికి రామ్ హీరోగా చేసిన రెడ్,  బెల్లంకొండ హీరోగా చేసిన అల్లుడు అదుర్స్ విడుద‌ల‌ అయ్యాయి.