మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతుంది. ఓ ప్రక్క స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూనే, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తుంది. సావిత్రిగా తన అద్భుత నటనతో జాతీయ అవార్డు గెలుపొందిన కీర్తి సురేష్, నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన పెంగ్విన్ మూవీలో తల్లిగా అధ్బుత నటనతో ఆకట్టుకున్నారు. అలాగే ఆమె మిస్ ఇండియా అనే మరో విమెన్ సెంట్రిక్ మూవీలో నటిస్తున్నారా. కాగా ఫీచర్ చిత్రాల దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుడ్ లక్ సఖి. 

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మారుమూల ప్రాంతానికి చెందిన అమ్మాయిగా కీర్తి నటిస్తుంది. ఈ మూవీలో ఆమె షూటర్ గా కనిపించనుంది. ఆది పినిశెట్టి మరియు జగపతిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. హ్యూమర్ అండ్ ఎమోషన్స్ జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రేపు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. 

కాగా గుడ్ లక్ సఖి తెలుగు టీజర్ రెబెల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 10:00లకు టీజర్ విడుదల అవుతుండగా, పేస్ బుక్ ద్వారా ప్రభాస్ ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా పేరున్న నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని అధ్బుతంగా తెరకెక్కించారని టాక్. దీనితో మూవీపై భారీ అంచనాలున్నాయి.