పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణం రాజు పేర్లు చెప్పగానే వారిచ్చే ఆతిధ్యం, దాతృత్వం గుర్తుకొస్తాయి. సినిమావాళ్లను కదిలించినా ముందు వారిచ్చే భారీ విందు భోజనాల గురించే చెబుతుంటారు.. అచ్చం రెబల్‌స్టార్ కృష్ణంరాజు లాగే ప్రభాస్ కూడా సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు పెద్దనాన్న కల నెరవేర్చబోతున్నాడు.. అదికూడా పేదల కోసమే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణం రాజు పేర్లు చెప్పగానే వారిచ్చే ఆతిధ్యం, దాతృత్వం గుర్తుకొస్తాయి. సినిమావాళ్లను కదిలించినా ముందు వారిచ్చే భారీ విందు భోజనాల గురించే చెబుతుంటారు.. అచ్చం రెబల్‌స్టార్ కృష్ణంరాజు లాగే ప్రభాస్ కూడా సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు పెద్దనాన్న కల నెరవేర్చబోతున్నాడు.. అదికూడా పేదల కోసమే..
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పాన్ ఇండియా యాక్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ కుడిచేత్తే చేసే సాయం ఎడమచేతికి కూడా తెలియదు. అదేవిధంగా ప్రభాస్ నటుడిగా ఎదగడానికి వెనకుండి నడిపించిన కృష్ణం రాజు కూడా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండేవారు. ఇక ఆయన నట వారసుడిగా నేడు పాన్ ఇండియా స్టార్‌గా సినీప్రేక్షకులను ఉర్రూతలు ఊపేస్తున్నారు ప్రభాస్. ఒకవైపు సినిమాలు చేస్తూనే ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. త్వరలో ప్రభాస్ సపోర్టుతో రెబల్‌స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి కలిసి ఓ హాస్పిటల్ నిర్మించి పేదలకు వైద్యం అందించాలనుకుంటున్నారట. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ?
కాళ్లు, చేతులు కోల్పోతున్న వారిని చూసి ప్రభాస్, కృష్ణంరాజు చలించిపోయేవారు..
మధుమేహం భారినపడి గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది పేదలు కాళ్లు, చేతి వేళ్లు కోల్పోవడం చూసి రెబల్‌స్టార్ కృష్ణంరాజు చలించిపోయేవారట. ఈ ఘటనలు చూసి చలించిపోయిన ఆయన ఏదోరంగా తన ప్రాంతంలోని ప్రజలకు మధుమేహంపై అవగాహన కల్పించి ఈ వ్యాధిబారిన పడకుండా పేదలు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టారని ఆయన సతీమణి శ్యామలాదేవి అన్నారు. యూకే ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా కృష్ణం రాజుకు వీరాభిమాని అయిన డాక్టర్ వేణు కవతప్, 20 మంది అపోలో వైద్యుల బృందం ఆధ్వర్యంలో భీమవరం చుట్టుపక్కల ప్రాంతంలోని షుగర్ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు దఫాలు క్యాంపులు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ విషయంలో ప్రభాస్‌కు తన వంతు సహాయం చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. త్వరలో ఓ ఆసుపత్రిని నిర్మించి భారతదేశంలోని ఏప్రాంతం వారైనా వచ్చి ఉచితంగా వైద్యం పొందేలా సకల సౌకర్యాలతో హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని శ్యామలాదేవి చెబుతున్నారు. దీనికి ప్రభాస్ మద్దతు కూడా ఉంటుందన్నారు. ఇది కృష్ణంరాజు కోరిక అని పేర్కొన్నారామె.
గతంలో ప్రభాస్ సేవా కార్యక్రమాలు ఇలా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. ఆరడుగులపైన ఆజానుభావుడు సహాయం చేయడంలోనూ తనది అంత పెద్ద మనసని అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాడు. కరోనా సమయంలో రూ.4.5 కోట్ల సాయాన్ని విరాళంగా ప్రకటించారాయన. అందులో రూ.3కోట్లు పీఎం నిధికి ఇవ్వగా.. రూ.50 లక్షలు చొప్పున కోటి రూపాయలను రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రభాస్ ఇచ్చారు. అంతేకాదు మరో రూ.50లక్షలను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కి ఇచ్చి సినిమా ఇండస్ట్రీలోని కళాకారులకు తోడ్పాటు అందించారు ప్రభాస్. దీంతోపాటు ఏటా 100మంది విద్యార్థులకు పాఠశాలల్లో ఫీజులు, దస్తులు, పుస్తకాలు, వారికి కావాల్సిన ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారంట మన ప్రభాస్. అంతేకాదు షుటింగ్ సమయంలో తన కేరవ్యాన్, సిబ్బంది ఖర్చులను ప్రభాసే భరిస్తాడట. గత ఏడాది ఏపీలోని విజయవాడ, హైదరాబాద్‌లో వరదలు సంభవించినప్పుడు ప్రభాస్ ఉదారతతో రూ.2కోట్లను ఒక్కో కోటి చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలను ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ప్రభాస్ చేసే సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ అటెన్షన్ కోరుకోడు.. ప్రచారం అంటే అసలే ఇష్టం ఉండదు. ఏ సాయమైన సీక్రెట్‌గానే చేసేస్తూ.. తన గొప్పమనసును చాటుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమాల్లో బిజీబిజీ..
ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే అరడజను సినిమాలు చేతిలో ఉండగా.. ఇంకో అరడజను సినిమాలు ప్రభాస్ ఓకే చెప్తే చాలు.. ఓ పదేళ్ల తర్వాత సినిమా తీద్దాం అనే నిర్మాతలు, దర్శకులు కూడా ఉన్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, సలార్, కల్కీ సీక్వెల్‌తోపాటు స్పిరిట్, రావణం సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అన్నీ కుదిరితే ప్రభాస్ నటించిన కన్నప్ప, రాజాసాబ్ సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయనున్నాయి.
