ప్రభాస్ వివాహంపై కృష్ణంరాజు క్లారిటీ

First Published 14, Dec 2017, 2:09 PM IST
rebel star krishnamraju clarity on prabhas marriage
Highlights
  • బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటానన్న ప్రభాస్
  • ప్రస్థుతం సాహో షూటింగ్ లో బిజీగా మారిన ప్రభాస్
  • ఇంట్లో వాళ్లడిగితే పెళ్లి పై ప్రభాస్ ఏం సమాధానం ఇసస్తున్నాడు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి వార్త మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 'బాహుబలి' తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన యంగ్ రెబల్ స్టార్... ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ 'సాహో' షూటింగులో బిజీ అయిపోయాడు. ప్రభాస్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ మీడియా కంటపడితే పెళ్లి గురించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. తాజాగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు ఇలాంటి పరిస్థితే ఎదురవ్వడంతో స్పందించారు.

 

బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని చెప్పారు, ఎందుకు జరగటం లేదనే ప్రశ్నకు కృష్ణ రాజు స్పందిస్తూ... దీంట్లో తమ ప్రమేయం ఏమీ లేదని, ప్రభాస్ తనకు తానుగా ఈ విషయంలో వెనక్కి వెళ్లాడని కృష్ణం రాజు తెలిపారు. ప్రభాస్ కోసం సంబంధాలు చూస్తున్నామని, తమకు నచ్చిన కొన్ని సంబంధాలను షార్ట్ లిస్ట్ చేశామని కృష్ణం రాజు తెలిపారు.

 

అయితే ప్రభాస్ నుండి పెళ్లి విషయంలో ఇంకా ఎలాంటి స్పందన లేదని తెలిపారు. పెళ్లి గురించి అడిగినప్పుడల్లా నా పెళ్లికి ఇంకా సమయం ఉందంటూ తప్పించుకుంటున్నాడట ఈ బాహుబలి స్టార్. ప్రభాస్ ఎప్పుడు ఓకే అంటాడా.. అని ఫ్యామిలీ మొత్తం వెయిట్ చేస్తున్నామని, ఒకసారి ప్రభాస్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేసేందుకు కుటుంబ సభ్యులమంతా సిద్ధంగా ఉన్నామని కృష్ణంరాజు తెలిపారు.

loader