ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి , విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు తేజ నేతృత్వంలో తెరకెక్కనున్న చిత్రం “ఎన్టీఆర్ “.ఈ మూవీ షూటింగ్ ఇటివల ఎంతో హట్టహాసంగా మొదలైంది.

 ఈ మూవీ నుండి తప్పుకుంటున్నట్లు తేజ ప్రకటించాడు .అయితే తేజ ఈ మూవీ నుండి సడెన్ గా తప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని సినీ రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ బయో పిక్ మూవీలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రధాన పాత్రలో నటిస్తుండగా ప్రతి పాత్ర చిత్రీకరణలో వేలు పెడుతున్నాడు అని తేజ అసహనాన్ని వ్యక్తం చేశారు అంట .

అంతే కాకుండా ఎన్టీఆర్ నిజజీవితంలో జరిగిన సంఘటనలను తీయకుండా కల్పిత సంఘటనలు టీడీపీ పార్టీ ప్రస్తుత అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా తీయమని బాలయ్య బాబు ఇతర టీడీపీ నేతలు ఒత్తిడులు చేస్తున్నారు అని అందుకే తేజ తప్పుకున్నారు అని వారు వ్యాఖ్యానిస్తున్నారు .అయితే ఎన్టీఆర్ చనిపోవడానికి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు అని ఇప్పటికే అందరు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెల్సిందే .