ఉయ్యాల వాడ జీవిత కథ ఆధారంగా ‘సైరా’ స్క్రిప్టు తయారైనా.. ప్రారంభం కాని షూటింగ్ అసలు కారణం ఇదే అంటున్న సినీ వర్గాలు
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150తో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ సినిమా భారీ విజయం తర్వాత ఉయ్యాల నరసింహారెడ్డి జీవిత కథ ఆదారంగా ‘సైరా’ చిత్రం చేస్తున్నారు. అయితే.. ఆ సినిమా షూటింగ్ మాత్రం గత కొద్ది రోజులుగా ఆలస్యమౌతూ వస్తోంది. సినిమాలోని నటీనటులను కూడా అధికారికంగా ప్రకటించినప్పటికీ.. షూటింగ్ మాత్రం ప్రారంభం కావడం లేదు. ఇందుకు చాలా కారణాలే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అసలు నిజం మాత్రం ఇప్పుడు బయటపడింది. ఓ డాక్టర్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమౌతూ వస్తోందట.
చిరంజీవి గత కొంత కాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నారట. ఆయనకు ముంబయికి చెందిన డాక్టర్ సంజయ్ చికిత్స అందిస్తున్నారు. అయితే.. ‘ట్రీట్మెంట్ పూర్తి అయి పూర్తిగా సెట్ అయ్యాకే సెట్స్‌కు వెళ్లాలని డాక్టర్ సంజయ్.. చిరంజీవికి చెప్పినట్టు తెలుస్తోంది. డాక్టర్ సూచన ప్రకారమే చిరంజీవి షూటింగ్ లో పాల్గొనడం లేదని సమాచారం. ఈ డాక్టర్ గతంలో బాలీవుడ్ నటులకు కూడా ఇలాంటి చికిత్సలు చేసినట్లు టాక్. దీనితో చిరు తన భుజం నొప్పి పూర్తిగా తగ్గితే కాని ‘సైరా’ రెగ్యులర్ షూటింగ్ కు రాడు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి.
అయితే చిరంజీవికి ఈభుజం నొప్పి చాలా వరకు తగ్గడంతో గత వారంరోజుల నుండి ‘సైరా’ కోసం రిహార్సల్స్ చేస్తున్నాడని టాక్. అయితే రెగ్యులర్ షూట్ కు చిరు ఎప్పటినుండి హాజరవుతాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈమూవీకి అతి ముఖ్యమైన ప్రధాన ఆయుధం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కావడంతో ఈచిత్ర నిర్మాత రామ్ చరణ్ ఎవ్వరిని నమ్మకుండా ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ని ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే దర్శకుడు సురేందర్ రెడ్డికి రెహమాన్ ఆలోచన విధానం సరిగ్గా కనెక్ట్ అవ్వడం లేదని పలురకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమా నుండి రెహమాన్ తప్పుకున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి.
