ప్రముఖ యాంకర్ ఝాన్సీ నటిగా కూడా కొన్ని సినిమాలు చేసింది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పలు యాంకర్లు దూసుకుపోతుంటే ఝాన్సీ మాత్రం సామాజిక చైతన్యం ఉన్న కార్యక్రమాల వైపే ఎక్కువగా మొగ్గు చూపేది. అయితే ఇక తను యాంకరింగ్ వృత్తికి గుడ్ బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. 

కొందరు తనపై కావాలని కుట్ర చేశారని అందుకే ఝాన్సీ యాంకరింగ్ కి దూరమైందని రకరకాల వార్తలు వినిపించడం మొదలయ్యాయి. వీటిపై తాజాగా స్పందించింది ఝాన్సీ. తనపై ఎవరూ కుట్ర చేయలేదని, యాంకరింగ్ నుండి దూరమవ్వాలనేది తన సొంత నిర్ణయమని ఎవరి బలవంతం లేదని స్పష్టం చేసింది.

ఇది సడెన్ గా తీసుకున్న నిర్ణయం కాదని, చాలా రోజులుగా ప్లాన్ చేసుకొని గతేడాదిలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఎలాంటి కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించినా..  కమిట్మెంట్ తో పని చేస్తానని చెప్పిన ఆమె.. ఎక్కువగా సామాజిక చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలనే హోస్ట్ చేసినట్లు తెలిపింది.

చేతన, నవీన లాంటి కార్యక్రమాలకు దశాబ్దకాలం పని చేసినట్లు చెప్పుకొచ్చింది. ఎంటర్టైన్మెంట్ షోలకు కూడా అవకాశాలు వచ్చినట్లు కొన్ని తనకు నచ్చక వదిలేస్తే.. మరికొన్ని తన ప్రవర్తన నచ్చక నిర్వాహకులు తీసుకోలేదని స్పష్టం చేశారు.