Asianet News TeluguAsianet News Telugu

#Animal: OTT లో 'సలార్' ని బీట్ చేసిన 'యానిమల్'…అసలు కారణం ఇదే!

 ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ‘సలార్‘ వర్సెస్ ‘యానిమల్‘ క్లాష్ కొనసాగుతోంది. నెట్ ప్లిక్స్ అఫీషియల్ లెక్కలు ప్రకారం యానిమల్(Animal Movie) టాప్ లో ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)....

Reason why Animal outshines Salaar on Netflix jsp
Author
First Published Feb 1, 2024, 8:52 AM IST

దాదాపు ఇరవై రోజుల గ్యాప్ లో థియేటర్స్ కు వచ్చిన రెండు పాన్ ఇండియా సినిమాలు ‘సలార్, యానిమల్‘. బాహుబలి తర్వాత సరైన హిట్ పడక...వరుస ఫ్లాపులతో సతమతమైన ప్రభాస్ ను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై నెంబర్ వన్ గా నిలిపిన చిత్రం ‘సలార్‘. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ థియేటర్లలో దుమ్మురేపి.. జనవరి 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీ జయంట్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే విడుదలైన అన్ని భాషల్లో ‘సలార్‘ ఇండియా వైడ్ ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది. రెండు, మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ లోకి వెళ్లింది.
 
అదే సమయంలో ‘సలార్‘ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన వారం రోజులకే.. మరో బ్లాక్ బస్టర్ హిట్ ‘యానిమల్‘ని దింపింది నెట్ ఫ్లిక్స్. రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 26 నుంచి ‘యానిమల్‘ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘యానిమల్‘కి కూడా ఓ రేంజులో వ్యూవర్ షిప్ వస్తోంది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రూపొందిన రణ్ బీర్ కపూర్ ‘యానిమల్‘ కల్ట్ హిట్ సాధించింది..కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ క్రమంలో  ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ‘సలార్‘ వర్సెస్ ‘యానిమల్‘ క్లాష్ కొనసాగుతోంది.

నెట్ ప్లిక్స్ అఫీషియల్ లెక్కలు ప్రకారం యానిమల్(Animal Movie) టాప్ లో ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన సలార్(Salaar Movie) టాప్ 2 ప్లేస్ లో నిలిచాయి . అయితే సలార్ నెంబర్ 2 కు రావటానికి కారణం ఏమిటీ అంటే..  ప్రభాస్ సలార్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో హిందీ కాకుండా మిగిలిన అన్ని భాషల డిజిటల్ వర్షన్ రిలీజ్ అయ్యింది.    తర్వాత యానిమల్ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే… అన్ని వర్షన్ లు కలిపి రిలీజ్ అయ్యింది. 

 నెట్ ఫ్లిక్స్ వాళ్ళు రీసెంట్ గా తమ ప్లాట్ ఫామ్ లో ఎక్కువ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న సినిమాలను అనౌన్స్ చేయగా సలార్ మూవీ కి మొత్తం మీద 9 రోజుల్లో 3.5 మిలియన్ యూనిక్ వ్యూస్ అలాగే 10.3 మిలియన్ గంటల వ్యూవర్ షిప్ సొంతం అయ్యిందని అనౌన్స్ చేశారు.  హిందీ వర్షన్ కూడా రిలీజ్ చేసి ఉంటే రెస్పాన్స్ ఇంకా సాలిడ్ గా సొంతం అయ్యి ఉండేదనేది నిజం. 

ఇక యానిమల్ మూవీ రికార్డుల దుమ్ము దులిపెస్తూ 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 6.20 మిలియన్ యూనిక్ వ్యూస్ అలాగే 20.80 మిలియన్ గంటల వ్యూవర్ షిప్ సొంతం చేసుకుంది.అల్టిమేట్ వ్యూవర్ షిప్ తో యానిమల్ మూవీ డిజిటల్ లో కుమ్మేస్తూ ఉండగా సలార్ మూవీ కూడా హిందీ వర్షన్ రిలీజ్ అయ్యి ఉంటే మరింత వ్యూయర్ షిప్ వచ్చేది. నెంబర్ వన్ కు వెళ్లినా ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడే ఏదీ అంచనా వేయలేం.  ఈ  రెండు సినిమాలు డిజిటల్ లో లాంగ్ రన్ లో ఎలాంటి జోరు చూపిస్తాయో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios