Asianet News TeluguAsianet News Telugu

హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య వెనుక కారణం ఇదా?

 ‘సెకండ్‌ హ్యండ్‌’, ‘కుందనపు బొమ్మ వంటి’, ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేరు’ వంటి పలు సినిమాల్లో నటించిన సుధీర్‌ బాబు జనవరి 18న విషం తీసుకొని ఆత్మహత్యాయత్నం

Reason behind Tollywood actor Sudheer Varma commits suicide
Author
First Published Jan 24, 2023, 11:04 AM IST


తెలుగు సినీ పరిశ్రమలో మరో పెను విషాదం చోటుచేసుకుంది. యువ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వైజాగ్ లో ఈ నటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణానికి గల కారణాలు రాకపోవటంతో ... వ్యక్తిగత సమస్యలే కారణమై ఉండొచ్చని భావించారు. అయితే చిన్న వయస్సు..ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు అలాంటివాడు సూసైడ్ అనగానే చాలా మందికి బాధ కలిగింది. ఎందుకు అనేది అందరూ ఆరా తీస్తున్నారు. ఈ నేపధ్యంలో అతని బంధువులు అందుకు కారణాలు తెలియచేసారు. వివరాల్లోకి వెళితే...

సుధీర్ వర్మ ..జనవరి 18న విషం తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.  వెంటనే ఈ విషయం గమనించిన ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్మెంట్  నిమిత్తం సుధీర్‌ వర్మను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఫస్ట్ ఎయిడ్ చేసి సుధీర్‌ను విశాఖలోని ఎల్‌. జీ. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించడం మొదలు పెట్టారు. చికిత్స పొందుతూనే సోమవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో సుధీర్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

అయితే సుధీర్ సూసైడ్‌ చేసుకోవడానికి గల కారణాలను బంధువులు తెలిపారు. గత కొన్ని రోజులుగా సుధీర్‌ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. దాంతో ఆ సమస్యలను తట్టుకోలేక సుధీర్‌ వర్మ విషం తాగినట్లు వెల్లడించారు. మరోవైపు వైద్యులు ఇచ్చిన డెత్ రిపోర్ట్ ప్రకారం... ఆయన విషం తీసుకున్నారు. ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. 

సుధీర్ వర్మ గురించి ఆయన స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ... వర్మ చాలా మంచి వ్యక్తి అని, చాలా సున్నిత మనస్కుడని చెప్పారు. వర్మ తండ్రి ఏ1 కాంట్రాక్టర్ గా ఉండేవారని, తండ్రి మరణం తర్వాత వర్మ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు.  నగరంలోని ఓ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలను నిన్న నిర్వహించారు.

2013లో కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన 'సెకండ్ హ్యాండ్' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వర ముళ్లపూడి దర్శకత్వంలో వచ్చిన 'కుందనపు బొమ్మ' చిత్రంలో నటించాడు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది. మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా కీలక పాత్రలను పోషించాడు.  ఆమధ్య మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత నిర్మించిన 'షూటౌట్ ఎట్ ఆలేర్' అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ఇదే అతని చివరి ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. మరోవైపు వర్మ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios