తెలుగు సినీపరిశ్రమలో మేమంతా ఒక్కటే అంటూ మన స్టార్ హీరోలు చాలాసార్లు స్టేజీలు పంచుకున్నప్పుడు చెప్పటం చూస్తూనే వుంటాం. అయితే ఎన్ని చెప్తున్నా అంతర్గతంగా సెలెబ్రిటీల మధ్య కోల్డ్ వార్ మాత్రం వుంటుంది. అలాంటి ఓ కోల్డ్ వార్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

విషయమేంటంటే.. తెలుగు అగ్రహీరోల్లో ఒకరైన వెంకటేష్, హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న రోజాతో కలిసి చాలా సినిమాలు చేశారు. అయితే వీరి మధ్య 22 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన ఇద్దరి మధ్య సంబంధాలు కట్ చేసిందట. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. రోజా తన భర్త సెల్వమణి తో కలిసి వెంకటేష్ హీరోగా, తాను హీరోయిన్ గా ‘చినరాయుడు' టైటిల్ తో ఓ సినిమా తీద్దామనుకున్నారట. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదని సమాచారం.

 

అయితే అదే చిత్ర కథాంశంతో విజయశాంతితో కలిసి వెంకటేష్ ‘చినరాయుడు' చిత్రంలో నటించారు. దాంతో రోజాకు కోపం వచ్చిందట. ఇలా చేశావేంటి అని వెంకటేష్‌ను రోజా అప్పట్లో నిలదీసిందట. అదంతా నిర్మాతల నిర్ణయమని, తన ప్రమేయం లేదన్నారట వెంకటేష్.

 

ఇక కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో ‘పోకిరి రాజా' అనే చిత్రం వెంకటేష్-రోజా కాంబినేషన్లో వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ కోసం రోజాను బాంబే తీసుకెళ్లి మూడు రోజుల పాటు ఏ షూటింగ్ లేకుండా హోటల్‌లో ఖాళీగా ఉంచారట. ఏంటని అడిగితే దర్శక నిర్మాతల నుండి సరైన సమాధానం రాలేదట. మూడు రోజులు ఖాళీగా ఉన్న రోజా తన భర్త సెల్వమణి బర్త్ డే అని చెప్పి ఎవరికీ చెప్పకుండా చెన్నై వెళ్లిపోయిందట. 4వ రోజు నుండి షూటింగ్ ప్లాన్ చేసుకున్న నిర్మాతలు రోజా చేసిన పనికి షాకయ్యారట. మీరు వస్తే షూటింగ్ కంప్లీట్ చేసుకుంటామని చిత్ర బృందం ఎంత చెప్పినా రోజా వినలేదట.

 

స్వయంగా వెంకటేష్ ఫోన్ చేసి మాట్లాడినా రోజా వినలేదని, తర్వాత తనకు నచ్చిన సమయంలో రోజా స్వయంగా వచ్చి షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్లిందని. అప్పటి నుండి ఇప్పటి వరకు రోజా- వెంకటేష్ మధ్య మాటలు లేవని టాక్. ఈ విషయం ఇండస్ట్రీలో కూడా చాలా మందికి తెలియదట.