2026 నాటికి ఇది ఏకంగా 226 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.. దీంతో నెట్ ప్లిక్స్  కంపెనీలు ఇండియన్ మార్కెట్ పై కన్నేసింది.  ఈ క్రమంలో రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ను కలవటం జరిగింది.


గత కొద్ది రోజులుగా గ్లోబుల్ స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ప్లిక్స్ కో సీఈవో Ted Sarandos ఇండియాలో ఉన్నారు. ఆయన ఇక్కడ చాలా మందిని కలుస్తూ బిజినెస్ మీటింగ్ లలో పాల్గొంటున్నారు. కేవలం బిజినెస్ మీటింగ్ లు మాత్రమే కాకుండా క్రియేటివ్ పార్టనర్స్ ని మీట్ అవుతున్నారు. ఈ క్రమంలో I&B మినిస్టర్ ని కలవటమే కాకుండా, ప్రముఖ దర్శకుడు రాజమౌళిని కలిసారు. రాజమౌళిని నెట్ ప్లిక్స్ కో సీఈవో కలవటం వెనక ఏదైనా డీలా ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. 

 ఓటీటీ మార్కెట్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చింది ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థనే అన్నది తిరుగులేని విషయం. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సినిమాలు మంచి సీరియల్స్ తో దూసుకుపోతున్న నెట్ ఫ్లిక్స్ కు ఇండియన్ మార్కెట్ మాత్రం ఎంతకీ కొరుకుడు పడడం లేదు. దాంతో వారు గత కొద్ది కాలంగా ఇండియన్ మార్కెట్ పై దృష్టి పెట్టారు. ఇండియాలో ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ 206 మిలియన్ డాలర్లుగా ఉంది. 2026 నాటికి ఇది ఏకంగా 226 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.. దీంతో నెట్ ప్లిక్స్ కంపెనీలు ఇండియన్ మార్కెట్ పై కన్నేసింది. ఈ క్రమంలో రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ను కలవటం జరిగింది.ఆ ఫొటో బయిటకు రాగానే అందరి దృష్టీ పడింది.

 ఓటీటీలోనూ `ఆర్ ఆర్ ఆర్` విజయ దుందుబీ మోగించటానికి కారణం నెట్ ప్లిక్సే. నెట్ ప్లిక్స్ హిందీ వెర్షన్ ని రిలీజ్ చేసింది. బాగా ప్రమోట్ చేసింది. యుఎస్ థియేటర్స్ లో భారీగా రిలీజ్ చేయటానికి నెట్ ప్లిక్స్ సాయపడింది. నెట్ ప్లిక్స్ దిగ్గజానికి భారతదేశం వెలుపలా భారీ స్థాయిని కలిగి ఉంది. ఇప్పుడీ క్రేజ్ తోనే `ఆర్ ఆర్ ఆర్` నెట్ ప్లిక్స్ లోనే అద్భుతాలు సృష్టించింది. నెట్ ప్లిక్స్ లో సినిమా లైవ్ కి వచ్చినప్పటి నుంచి నాన్ ఇండియన్స్ నుంచి ఆర్ ఆర్ ఆర్ అసాధారణంగా దూసుకుపోయింది. 18.36 మిలియన్ గంటల పాటు వీక్షించిన ఆంగ్లేతర చిత్రంగా `ఆర్ ఆర్ ఆర్` అరుదైన రికార్డుని నెట్ ప్లిక్స్ లో సృష్టించింది. నెట్ ప్లీక్స్ స్ట్రీమింగ్ లోనే ఇది ఓ చరిత్ర అని అధికారికంగా ప్రకటించింది. 

ఇండియన్ సినిమాని ఇతర దేశస్తులు ఈ స్థాయిలో ఆదరించడం ఇదే తొలిసారి. అదే వారంలో నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ `టాప్ గన్` 6.44 మిలియన్ గంటలు అత్యధికంగా వీక్షించిన చిత్రంగా ఉంది. ఆ రికార్డులన్నింటిని `ఆర్ ఆర్ ఆర్` తుడిచిపెట్టేసింది. ఇవన్నీ ఆర్ ఆర్ ఆర్ పై ప్రపంచ దృష్టి పడేలా చేసాయి. ఈ క్రమంలోనే రాజమౌళి తో ఓ సీరిస్ చేయాలని నెట్ ప్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యాక్షన్ ఎడ్వెంచర్ కథతో ఆ సీరిస్ ఉండాలని భావిస్తున్నట్లు వినికిడి. రాజమౌళి అండతో ఇండియన్ ఓటిటి మార్కెట్ లో తన వాటా పెంచుకోవాలనేది నెట్ ప్లిక్స్ ఆలోచనగా చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.