పవన్ కళ్యాణ్ ఈ మధ్య రీమేక్  సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇలా రీమేక్ ల వైపు మళ్లటం వెనుక ఒక మర్మం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. రీమేక్ లో కూడా తక్కువ కష్టంతో కూడిన స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని, వాటిని తక్కువ ఖర్చులో  చుట్టేసి ఎక్కువ లాభాలు పొందాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అందుకు ఉదాహరణగా పింక్, డ్రైవింగ్ లైసెన్స్ రెండు రీమేక్ లు చూపెడుతున్నారు. ఈ విషయమై ఎవరైనా వాదిస్తే ...డబ్బులు సంపాదించడం కోసమే సినిమాలలోకి తిరిగివచ్చా అని పవన్ కళ్యాణ్ బాహాటంగానే ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో నిజమెంత.. 

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలు ఇక చేయరని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా ఆయన వకీల్ సాబ్ సినిమాకీ, మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా ఒకటని చెప్తున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ సినిమా కానీ, పింక్  కాని రెండూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలే. అయితే పవన్ అందులో కాన్సెప్టు చూసి ఓకే చేసాడని తెలుస్తోంది. అంతేకానీ వాటిల్లో తన పాత్ర పెద్దగా కష్టపడక్కర్లేదనో మరొకటో ఓకే చేయలేదట. ఎందుకంటే పవన్ కు తెలుసు..తన అభిమానులు తన నుంచి ఏమి ఆశిస్తారో. అయినా సరే ప్రజలకు కొద్దిగా అయినా సందేశం ఇవ్వగలగాలి అని పింక్ ఓకే చేసారట. అదే పద్దతిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా.

 సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలను ఈ సినిమా ప్రస్తావించిందిట. అంతేకానీ తన పాత్ర, గ్లామర్, ఇమేజ్ వంటివి చూసుకుని కాదని చెప్తున్నారు. పవన్ ఎంత కష్టమైనా పడటానికి ఇష్టపడతారని, అయితే సినిమాలో కంటెంట్ మాత్రం ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడితే బాగుంటుందని భావిస్తారని చెప్తున్నారు. అదే ఇప్పుడు ఆయన చేస్తున్నారట. అంతే తప్పించి ..మీడియాలో ప్రచారం జరుగుతున్న విధమైన ఆలోచనలు ఆయన ఎప్పుడూ చేయరని చెప్తున్నారు. 

 2019లో మలయాళంలో వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  అయితే మొన్నటివరకు ఈ చిత్రం విక్టరీ వెంకటేశ్‌ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్ర రీమేక్‌ హక్కులు కొన్న నిర్మాత పవన్‌తో ఈ సినిమా తీయాలని భావిస్తున్నారట. ఈ సినిమా స్టోరీ విన్న పవన్‌ సైతం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’పై ఆసక్తి కనబరుస్తున్నారని టాక్‌.  పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను పవన్‌ చేస్తారని, ఈ సినిమాలో ఉండే మరో ప్రధాన పాత్ర కోసం పవన్‌ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ లేక వైష్ణవ్‌ తేజ్‌ను తీసుకోవాలని నిర్మాత ఆలోచిస్తున్నారట.