తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు అందుకుంటున్న తెలుగు హీరోయిన్ అంజలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో వెంకటేష్ సరసన నటించిన అంజలి, ఆఖరిగా 'చిత్రాంగద' సినిమాలో కనిపించింది. ఇక్కడ అడపాదడపా కనిపించినా తమిళ తంబిలతోనే ఎక్కువగా కాలేక్షేపం చేస్తోంది.  వ్యక్తిగత జీవితానికి వస్తే...గత కొంతకాలంగా అంజలి తన జర్నీ కో స్టార్ జై తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందని వీరిద్దరూ లైవ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు మనం వింటూనే ఉన్నాం. 

అయితే వీరిద్దరూ ఆ మధ్యన బ్రేకప్ అనేసుకుని విడిపోయారని సమాచారం. అందుకు కారణం ఏమిటనేది ఎవరికీ తెలిసి రాలేదు. తమిళ సినిమా వర్గాల సమాచారం ప్రకారం...ఈ ఇద్దరూ కెరీర్ లు రీసెంట్ గా చేసిన సినిమాలు గురించి ఓ రోజు మాట్లాడుకుంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారట. అందులో జై ఇంకాస్త రెచ్చిపోయి ...అంజలిని నోటి కొచ్చినట్లు తీసిపారేస్తూ మాట్లాడేశాడట. 

ఆమెను పర్శనల్ గా డీగ్రేడ్ చేసేసరికి ఆమె కాలి, నీలాంటి వాడితో ఇన్నాళ్లు ఎలా రిలేషన్ మెయింటైన్ చేశాను అన్నట్లు వాపోయిందట. దాంతో మరింత గా కోపం తెచ్చుకున్న జై..నీ కోసం అంత చేశాను..ఇంత చేశాను... బ్రేకప్ అని ప్రకటించేసాడట. ఇదీ తమిళ మీడియా రాసుకొస్తున్న కథనం. అయితే ఇందులో నిజమెంత ఉందనేది మాత్రం తెలియటం లేదు. 

మరో ప్రక్క  అంజలి మాట్లాడుతూ.. జై తో తన అనుబంధం గురించి ఎప్పుడూ మీడియా ముందు తను చెప్పలేదని మీడియా వాళ్లే కథలు అల్లుకొని మరి రాశారని వాటికి తను ఎందుకు జవాబివ్వాలని ఎదురు ప్రశ్నించింది . అలాంటి గాసిప్స్ విన్నప్పుడు తను చాలా బాధపడేదాన్ని అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని కొన్నాళ్ళు సినిమాలపైనే దృష్టి పెడతానని తేల్చిచెప్పింది.

ముఖ్యంగా గ్లామరస్ రోల్స్ పై కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల పై దృష్టి పెట్టిన అంజలి మమ్మూట్టి తో 'పేరంబు' అనే సినిమాలో కనిపించింది. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.