మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ ఇలా మెగాహీరోలు హాజరయ్యారు. కానీ అక్కడ అల్లు అర్జున్ మాత్రం కనిపించలేదు.

ఈ విషయం పలు అనుమానాలకు దారి తీసింది. బన్నీ కావాలనే రాలేదని, 'అల వైకుంఠపురములో' సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వలన రాలేదని ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వార్తలు రాశారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుందనే విషయం బయటకి అనౌన్స్ చేసినప్పటి నుండి గెస్ట్ లుగా పవన్ కళ్యాణ్ పేరు బాగా వినిపించింది.

రామ్ చరణ్ ఎలానూ నిర్మాత కాబట్టి ఆయన వస్తారు. ఈ ప్రాసెస్ లో బన్నీ పేరు ఎక్కడా వినిపించలేదు. తను వస్తున్నట్లు కానీ వస్తానని కానీ ప్రకటించకుండా, రామ్మనిమాట మాత్రానికి కూడా నిర్మాత హోదాలో ఉన్న రామ్ చరణ్ చెప్పలేదని.. దీంతో తను మాత్రం ఎందుకు వెళ్లాలని బన్నీ ఫీలైనట్లు సమాచారం.

అందుకే సినిమా ట్రైలర్ పై సోషల్ మీడియాలో కామెంట్ చేయకుండా ఫంక్షన్ కి హాజరు కాకుండా సైలెంట్ గా ఉండిపోయాడని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.