నటి కూతురి ఆత్మహత్యకు కారణం ఇదేనా..?

reason behind actress annapoorna's daughter suicide
Highlights

కీర్తి బిడ్డకు సరిగ్గా మాటలు రావడం లేదు. గత కొద్దిరోజులుగా బిడ్డకు స్పీచ్ థెరపీ చేయిస్తున్నాం. తన బిడ్డకు మాటలు రావేమోనని భయం కీర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. నీ బిడ్డకు ఏం కాదని మేము ఆమెకు ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ కూడా ఇప్పించాం

సినీ నటి అన్నపూర్ణ కుమార్తె కీర్తి ఈరోజు బంజారాహిల్స్ లో తన నివాసంలో సూసైడ్ చేసుకొని చనిపోయింది. అన్నపూర్ణకి పిల్లలు లేరని కీర్తిని దత్తత తీసుకుంది. మూడేళ్ల క్రితం ఆమెకు వివాహం చేసింది. కీర్తి భర్త వెంకట కృష్ణ రాయచూర్ లో 'ఎఫ్ఐసి'లో క్లర్క్ గా పని చేస్తున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది.

బంజారాహిల్స్ పరిధిలో శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న కీర్తి బలవన్మరణానికి పాల్పడ్డానికి కారణం ఆమె ఆరోగ్య సమస్యలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆమె సన్నిహితులు ఈ విషయంపై మాట్లాడుతూ..

''కీర్తి బిడ్డకు సరిగ్గా మాటలు రావడం లేదు. గత కొద్దిరోజులుగా బిడ్డకు స్పీచ్ థెరపీ చేయిస్తున్నాం. తన బిడ్డకు మాటలు రావేమోనని భయం కీర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. నీ బిడ్డకు ఏం కాదని మేము ఆమెకు ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ కూడా ఇప్పించాం. ఈరోజు ఉదయం ఆమె తన బెడ్ రూమ్ నుండి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో డోర్ పగలగొట్టి చూడాల్సివచ్చింది. అప్పటికే ఆమె ఫ్యాన్ కు ఉరేసుకొని మరణించింది'' అని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  

loader