"ఆది పురుష్" సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది జూన్ 16వ తేదీకి వాయిదా పడింది.. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. అయితే అదొక్కటే కారణం కాదంటున్నారు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'ఆదిపురుష్' (Adipurush) వాయిదా పడటం ఊహించిందే అయినా అభిమానులకు డైజస్ట్ చేసుకోవటం కష్టంగా ఉంది. రాధేశ్యామ్ డిజాస్టర్ జ్ఞాపకాల నుంచి ఈ సినిమా బయిటపడేస్తుందని ఆశలు పెట్టుకుంటే సంక్రాంతి నుంచి ఈ సినిమా ప్రక్కకు వెళ్లింది. అయితే ఈ సినిమా వాయిదా పడటానికి కారణం ...సినిమాకు రిపేర్లు చేయాలనే మాట వినపడుతోంది. అయితే అదొక్కటే కారణం కారణం బాలీవుడ్ మీడియా అంటోంది.
రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన విమర్శలపై ఫోకస్ చేసిన చిత్ర టీమ్.. టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టిందని.. ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టి మరోసారి వీఎఫ్‌ఎక్స్, సీజీ పనులు చేయిస్తోందని బీటౌన్ టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే 'ఆదిపురుష్' వచ్చే ఏడాది సమ్మర్‌లో కూడా థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదని ఆయా కథనాల్లోని సారాంశం. అయితే ఈ సినిమా రిపేర్లు ఎలా ఉన్నా ముందు...'ఆదిపురుష్' పై వచ్చిన నెగిటివి, అసంతృప్తి మర్చిపోవటానికి ఆరు నెలలు టైమ్ తీసుకుంటే బెస్ట్ అని భావించారట. ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓపినింగ్స్ పై ఉంటుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పై ఉంటుంది. జనం ఈ విషయం మర్చిపోయాక ప్రెష్ గా ఓ ట్రైలర్ వదిలి హైప్ క్రియేట్ చేసి ఆదిపురుష్ ని వదులుతారని చెప్పుకుంటున్నారు. ఇది ఓ స్ట్రాటజీగా చేస్తున్న యత్నం అని వివరిస్తున్నారు.
మహాకావ్యం రామాయణాన్ని ఆధారంగా చేసుకుని 'ఆదిపురుష్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో, సీతగా కృతిసనన్ నటించారు. రామాయణంలో కీలకపాత్రగా భావించే రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. దసరా వేడుకల్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాము ఊహించిన స్థాయిలో టీజర్ లేదని, లంకేశ్వరుడు, హనుమంతుడు లుక్స్, వీఎఫ్‌ఎక్స్ అంతగా బాగోలేదని విమర్శించారు. ప్రభాస్ ఉదాసీన వైఖరిని ఆసరాగా తీసుకుని మేకర్స్ ఇలా వ్యవహరించారంటూ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.దీంతో టీమ్.. ఇప్పుడు తప్పులను సరిచేసే పనిలో పడినట్లు సమాచారం. ఏదైమైనా ప్రభాస్ అభిమానుల్లోని అసంతృప్తిని పోగొట్టడానికి దర్శకుడు ఓం రౌత్ ఈ ఆరునెలల సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే బెస్ట్.
