వరుస విజయాల హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఆ మధ్యన అఫీషియల్ గా లాంచ్ అయ్యి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా ఈ చిత్రం కు రీషూట్స్ చేస్తున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటివరకూ తీసిన రష్ ని చూసుకున్న విజయ్ దేవరకొండ, నిర్మాతలు అసంతృప్తిగా ఫీలయ్యారని,అందుకే రీషూట్ అని సారాంశం. 

ఈ రీషూట్ విషయాన్ని కొంతమంది కొట్టిపారేసారు. మరికొంతమంది నిజమే అన్నారు. కానీ డియర్ కామ్రేడ్ టీమ్ ఏమీ స్పందించలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం..రీషూట్ చేయటం నిజమే అనితెలుస్తోంది. అయితే అందుకు కారణం వేరే ఉందట. 

వరుసగా గీతాగోవిందం, టాక్సీవాలా హిట్స్ తో విజయ్ దేవరకొండ క్రేజ్ పీక్స్ కు వెళ్లిపోయింది. అదే సమయంలో అతని మార్కెట్ కూడా 40 కోట్లకు రీచ్ అయ్యింది. దాంతో చిన్న సినిమా అనుకుని మొదలెట్టిన ఈ సినిమాను పెద్దది చేయాలనుకుంటున్నారట నిర్మాత, హీరో. తక్కువ బడ్జెట్ లో తీయాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా టేబుల్ ప్రాఫిట్స్ తో అమ్మగలమని నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు భావిస్తున్నారట. దాంతో సినిమాకు మరింత రిచ్ లుక్, భారీతనం తెచ్చే పనిలో పడ్డారట. 

ఈ క్రమంలో డైరక్టర్ ని కూర్చోబెట్టి...బడ్జెట్ పెరిగినా ఫరావాలేదు..సీన్స్ ఛేంజ్ చేసి రీషూట్ చేయమన్నారుట. అప్పటిదాకా తీసిన కొన్ని సన్నివేశాలు బాగున్నా..పెరిగిన బడ్జెట్ తో వాటిని మరింత అద్బుతంగా తీయవచ్చు అని విజయ్ దేవరకొండ భావించారట. అందుకే రీషూట్స్ పెట్టుకున్నారని తెలుస్తోంది. అంతేతప్ప డైరక్టర్ సరిగ్గా తీయకో, అవుట్ ఫుట్ బాగో లేకో కాదట. అదీ విషయం.

ఇక డియర్ కామ్రేడ్ చిత్రాన్ని భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి జైకృష్ణ మాటలు రాస్తున్నారు. 

రామాంజనేయులు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరామెన్: సుజిత్ సరంగ్, ఎడిటర్: శ్రీజిత్ సరంగ్, డైలాగ్స్: జైకుమార్, బ్యానర్స్: మైత్రి మూవీమేకర్, బిగ్‌బెన్ సినిమాస్ నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చిరుకూరి (సి.వి.ఎం), యస్.రంగినేని.