సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న నూతన చిత్రం 'దర్బార్'. తాజాగా సినిమా సెకండ్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో రజినీ బ్లాక్ కలర్ బనియన్ లో రెండు చేతులతో రాడ్‌ను పట్టుకుని కోపంగా పైకిలేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే అరవై ఏళ్ల వయసులో అంతటి టోన్డ్ కండరాలు ఎవ్వరికీ ఉండవని, ఆయనకు లేని మజిల్స్ చూపించాలని లుక్‌ను ఫొటోషాప్ చేసి అభిమానులను మోసం చేస్తున్నారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

మరికొందరు ఫోటోని మార్ఫ్ చేసి ఉంటారని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారికి రజినీకాంత్ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో ఘర్షణ మొదలైంది. ఒకరినొకరు దూషించుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా రజినీకాంత్ సినిమాకు సంబంధించి ఎలాంటి లుక్ విడుదలైనా తలైవాని పొగిడేస్తుంటారు.

కానీ ఈసారి మాత్రం అలా జరగడం లేదు సరికదా.. రజినీకాంత్ మీద కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఫోటోలో కనిపిస్తున్నట్లు అవి తలైవా మజిల్సేనా..? లేక ఫోటోషాప్ చేశారా..? అనే విషయాలపై దర్శకుడు మురుగదాస్ స్పందించాల్సివుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం ఆదిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.