సాధారణంగానే ఆడపిల్లలను వయసు అడిగితే అంత త్వరగా చెప్పరు.. వయసు విషయంలో ఆడవాళ్లు సీక్రెసీ మైంటైన్ చేస్తుంటారు. ఇక గ్లామర్ ప్రపంచంలో పనిచేసే హీరోయిన్ల మొదటి లక్షణం వయసు దాచడం. మీ వయసెంత అని అడిగితే నవ్వేసి ఊరుకుంటారే తప్ప సమాధానం చెప్పరు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ వయసు ముప్పైకి పైగా ఉంటాయని అంటారు. కానీ ఆమె మాత్రం తన వికీపీడియాలో చాలా ఏళ్లు తగ్గించి రాయించుకుందని చెబుతారు. ఇప్పుడు యంగ్ హీరోయిన్ నభా నటేష్ కూడా అలానే చేసిందని అంటున్నారు.

ఆమె తన అసలు వయసు బయట పెట్టకుండా తనకు ఇంకా 23 ఏళ్లుగా చెప్పుకుంటోంది. నాలుగేళ్ల క్రితం ఓ కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లని చెబుతున్నారు. నిజానికి నభా తన ఇంజనీరింగ్ పూర్తి చేసి కొంతకాలం గ్యాప్ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చింది.

ఆ లెక్కన ఆమె వయసు 28కి దగ్గరగా ఉంటాయని తెలుస్తోంది. అయితే అంత వయసు చెబితే యువహీరోల పక్కన అవకాశాలు రావాలని, తన వయసు తగ్గించుకొని.. దాని ప్రకారమే వికీపీడియాలో రాయించిందట. అయితే ఆమెతో పని చేసిన కొందరు హీరోలకు ఈ విషయం తెలుసని సమాచారం. ఎంత సీక్రెట్ గా ఉంచాలని చూసిన నభా వయసు మాత్రం దాచిపెట్టలేకపోయింది.