హిట్టు హిట్టుకు రామ్ చరణ్ రేంజ్ పెరిగిపోతుంది. ఓ దశలో రేసులో వెనుకబడిన రామ్ చరణ్ తిరిగి పుంజుకున్నాడు. ఏకంగా పాన్ ఇండియా హీరో ఇమేజ్ పై కన్నేశాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో నేషనల్ వైడ్ ఫేమ్ రాబట్టాడు.
చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ భారీగా ఉన్నాయి. వాటిలో శంకర్ చిత్రం ఒకటి. ఇండియన్ సినిమాకు భారీతనం పరిచయం చేసిన ఫస్ట్ డైరెక్టర్ శంకర్. ఆయన దర్శకత్వంలో మూవీ చాలా మంది స్టార్ హీరోల కలగా ఉంటుంది. కాగా శంకర్ ఏరికోరి తన ప్రాజెక్ట్ కోసం చరణ్ ని ఎంచుకున్నారు. చరణ్ 15వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా శంకర్ మూవీతో చరణ్ మరో ఇండస్ట్రీ హిట్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. శంకర్ ఈ చిత్రాన్ని చరణ్ కి కలిసొచ్చిన సెంటిమెంట్ జోడించి తెరకెక్కిస్తున్నారు. మగధీర, రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల సెంటిమెంట్ ఆర్సీ15లో చోటు చేసుకుంది. మరి ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే చరణ్ కి భారీ హిట్ దక్కుతుంది.
చరణ్ ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ మగధీర. ఈ మూవీని రాజమౌళి పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కించారు. మగధీర మూవీలో కాలభైరవగా చరణ్ రోల్ అద్భుతం చేసింది. ఇక మగధీర మూవీ రికార్డ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మగధీర తర్వాత చరణ్ కి ఆస్థాయి హిట్ ఇచ్చిన మూవీ రంగస్థలం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ 80ల కాలం కథగా తెరకెక్కింది. రంగస్థలం మూవీ కూడా పీరియాడిక్ విలేజ్ డ్రామా అని చెప్పాలి. చాలా కాలం తర్వాత రంగస్థలం మూవీతో చరణ్ సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ మూవీ అనేక కొత్త రికార్డ్స్ నమోదు చేసింది .
ఇక లేటెస్ట్ సెన్సేషన్ ఆర్ ఆర్ ఆర్ పీరియాడిక్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ వేయి కోట్ల వసూళ్ల వైపు దూసుకెళుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఈ మల్టీస్టారర్ తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసింది. పీరియాడిక్ సెంటిమెంట్ రామ్ చరణ్ కి కలిసి రాగా మూడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు. కాగా శంకర్ మూవీలో కూడా పీరియడ్ ఎపిసోడ్ ఉంటుందట. చరణ్ పీరియాడిక్ లుక్ లీక్ కావడంతో ఈ వార్త నిజమని తెల్సింది. పంచ కట్టులో చాలా సాధారణంగా చరణ్ సైకిల్ పై వెళుతున్న లుక్ ఆసక్తి రేపుతోంది.
పీరియడ్, కాంటెంపరరీ నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ మూవీ సక్సెస్ సెంటిమెంట్ కలిగి ఉంది. ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.
