మహేష్ సినిమాకు సీమ టచ్!

rayalaseema backdrop for mahesh babu vamsipaidipalli movie
Highlights

కొన్నేళ్ళ క్రితం స్టార్ స్టార్ హీరోలందరూ కూడా ఫ్యాక్షన్ నేపధ్యంలో సినిమాలు చేశారు

కొన్నేళ్ళ క్రితం స్టార్ స్టార్ హీరోలందరూ కూడా ఫ్యాక్షన్ నేపధ్యంలో సినిమాలు చేశారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసి ఘన విజయాలను అందుకున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మాత్రం సీమ నేపధ్యంలో సినిమాలు బాగా తగ్గిపోయాయి. అయితే మన హీరోలకు ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాలపై ఆసక్తి కలుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో త్రివిక్రమ్ కొన్ని రాయలసీమ సన్నివేశాలను యాడ్ చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా మహేష్ బాబు సినిమాకు కూడా సీమ టచ్ జోడించారని సమాచారం. మహేష్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమా ప్లాన్ చేశాడు. త్వరలోనే  ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఫారిన్ లో చిత్రీకరించనున్నారు. ఇండియాకు సంబంధించిన సన్నివేశాలను మాత్రం రాయలసీమలో షూట్ చేయనున్నారు. ఇందులో మహేష్ ను సీమ మూలాలున్న వ్యక్తిగా చూపిస్తారనే టాక్ కూడా ఉంది. దిల్ రాజు, అశ్వనీదత్ కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. 

loader