Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి పండుగకు రవితేజ ‘ఈగల్’.. అఫీషియల్ రిలీజ్ డేట్.. పోటీ గట్టిగానే ఉందిగా!

మాస్ మహారాజ రవితేజ - కార్తీక్ ఘట్టంనేని కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఈగల్’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుకగా రానున్నట్టు ప్రకటించారు. 
 

RaviTejas Eagle Movie Relese date announced NSK
Author
First Published Sep 27, 2023, 5:15 PM IST | Last Updated Sep 27, 2023, 5:20 PM IST

మాస్ మహారాజా రవితేజ (RaviTeja) వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవితో కలిసి రచ్చ  చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణసుర’తో అలరించారు. ఇటు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి.. మరోవైపు అనౌన్స్ మెంట్లు, అప్డేట్లు వస్తూనే ఉండటం మాస్ రాజా అభిమానులను ఖుషీ చేస్తోంది. 

ఇక మాస్ మహారాజా రవితేజ - కార్తీక్ ఘట్టంనేని కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం Eagle. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ రూపొందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా కార్తీక్ గట్టమనేని ఈ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈరోజు మేకర్స్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. 

‘ఈగల్’ ఇంటెన్స్ పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. 2024 సంక్రాంతికి జనవరి 13న థియేటర్లోకి రానుందని అనౌన్స్ చేశారు. పోస్టర్‌లో రవితేజ చేతిలో తుపాకీ, వెనకాల కాలుతున్న అడవిని చూడవచ్చు. నిప్పంటించిన ఫారెస్ట్ లో స్టైలిష్‌గా నిల్చున్నారు మాస్ రాజా. పోస్టర్‌లో అయితే రవితేజ ముఖం కనిపించడం లేదు. ఇక పైన రెస్క్యూ టీం విమానం గాల్లో ఎగురుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. పోస్టర్ మొత్తంగా ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉంటే.. సంక్రాంతి బరిలో ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’, సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రాలున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా సంక్రాంతికే పోటీ పడనుందని అంటున్నారు. ఈ భారీ చిత్రాలకు పోటీగా మాస్ మహారాజా ‘ఈగల్’ రాబోతుండటం విశేషం. ఇక సంక్రాంతికి నాగార్జున ‘నా సామీ రంగ’, విజయ్ దేవరకొండ VD13, తేజ సజ్జా ‘హనుమాన్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 

ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయిక. కావ్య థాపర్ మరో హీరోయిన్. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం. కార్తీక్ గడ్డంనేని రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ హైబడ్జెట్ ఎంటర్‌టైనర్ కోసం, టాప్ టెక్నీషియన్ల బృందం పనిచేస్తోంది. దావ్‌జాంద్ సంగీత దర్శకుడు. 

ఇదిలా ఉంటే.. వచ్చే నెలలో అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మాసీవ్ రెస్సాన్స్ దక్కింది. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక గోపీచంద్ మాలినేనితో మాస్ రాజా నాలుగోసారి సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే RT4GM చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios