Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీలో రవితేజ మూవీ అరుదైన ఫీట్... ఇండియాలోనే మొదటి చిత్రం!

హీరో రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావు అరుదైన ఫీట్ అందుకుంది. దేశంలోనే మొట్టమొదటి చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఆ ఘనత ఏమిటో చూద్దాం.. 
 

raviteja tiger nageswararao movie sign language version in prime ksr
Author
First Published May 28, 2024, 10:14 AM IST

గత ఏడాది రవితేజ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా  రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా భారీగా విడుదల చేశారు. దర్శకుడు వంశీ కృష్ణ తెరకెక్కించాడు. రవితేజకు జంటగా నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటించారు. టైగర్ నాగేశ్వరరావు మూవీతో రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మురళీ శర్మ, నాజర్, జిషు సేన్ గుప్త కీలక రోల్స్ చేశారు. 

టైగర్ నాగేశ్వరరావు మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. టైగర్ నాగేశ్వరరావు డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కాగా టైగర్ నాగేశ్వరరావు మూవీ సరికొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. 

దివ్యాంగుల కోసం సైన్ లాంగ్వేజ్ వెర్షన్ అందుబాటులోకి తెచ్చారు. వినికిడి శక్తి లేని వాళ్ళు సైన్ లాంగ్వేజ్ వెర్షన్ చూసి ఎంజాయ్ చేయవచ్చు. సినిమాలోని ప్రతి డైలాగ్ ని ఎక్స్పర్ట్ సైన్ లాంగ్వేజ్ లో వివరిస్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓ ప్రోమో కూడా విడుదల చేశారు. సైన్ లాంగ్వేజ్ లో అందుబాటులో ఉన్న మొదటి ఇండియన్ మూవీగా టైగర్ నాగేశ్వరరావు రికార్డులకు ఎక్కింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios