ఇప్పుడు రవితేజ పారితోషికం వార్తల్లో నిలుస్తుంది. ఆయన ఒక్కో సినిమాకు అందుకునే రెమ్యూనరేషన్‌ హాట్‌ టాపిక్‌ అవుతుంది. అందుకు కారణంగా ఆయన ఫాలో అవుతున్న కొత్త ట్రెండ్‌ అని చెప్పొచ్చు. రవితేజ జయాపజయాలకు అతీతంగా సినిమాలు చేస్తున్నారు. అదే స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు.

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja) జెట్‌ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు ఇటీవల `ఖిలాడీ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. కానీ ఈ చిత్రం సక్సెస్‌ కాలేదు. `క్రాక్‌` సక్సెస్‌తో ట్రాక్‌లోకి వచ్చి కెరీర్‌ని పరుగులు పెట్టిస్తున్న సమయంలో raviterja నటించిన లేటెస్ట్ మూవీ పరాజయం చెందడం.. ఆయన మార్కెట్‌పై ప్రభావాన్ని చూపిస్తుంది. 

ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రంలో `రామారావు`(Ramarao Movie) ఒకటి. శరత్‌ మాండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ శివరాత్రి సందర్భంగా మంగళవారం విడుదలైంది. మాస్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ పారితోషికం(Raviteja Remunaration) వార్తల్లో నిలుస్తుంది. ఆయన ఒక్కో సినిమాకు అందుకునే రెమ్యూనరేషన్‌ హాట్‌ టాపిక్‌ అవుతుంది. అందుకు కారణంగా ఆయన ఫాలో అవుతున్న కొత్త ట్రెండ్‌ అని చెప్పొచ్చు. 

రవితేజ జయాపజయాలకు అతీతంగా సినిమాలు చేస్తున్నారు. అదే స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు. ఇటీవల `ఖిలాడీ` చిత్రానికి ఆయన సుమారు పదిహేను కోట్లు పారితోషికంగా అందుకున్నట్టు సమాచారం. కొత్త చిత్రాలకు దాదాపు ఇరవై కోట్ల వరకు అందుకుంటున్నారట. అయితే హీరోల పారితోషికం సినిమా మొత్తానికి ఇంత అని ఉంటుంది. జీఎస్టీతో కలిసి పారితోషికం ముట్టజెబుతుంటారు నిర్మాతలు. జీఎస్టీ కూడా నిర్మాతలే చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం పారితోషికంలో కొంత బ్లాక్‌లో, మరికొంత వైట్‌లో అందజేస్తుంటారు. వైట్‌ కే ట్యాక్స్ లు పే చేస్తారు, బ్లాక్‌ అమౌంట్‌కి నో ట్యాక్స్. 

అయితే రవితేజ పారితోషికం విషయంలో కొత్త పంథాని ఫాలో అవుతున్నారు. ఆయన రోజువారి పారితోషికం తీసుకుంటున్నారట. ఒక్కో రోజు యాభై లక్షల రూపాయలు పారితోషికంగా అందుకుంటున్నట్టు ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందుకే ఇది హాట్‌ టాపిక్‌ అవుతుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `రామారావు` చిత్రానికి రవితేజ సుమారు 25 రోజుల్లో పూర్తి చేయాలనుకున్నారు. కానీ అనేక కారణాలతో దాదాపు 33 రోజులు షూటింగ్‌ జరిగిందట. ఇంకా ఒకటి రెండు రోజులు ప్యాచ్‌వర్క్ ఉందని తెలుస్తుంది. మొత్తంగా ఈ చిత్రానికి 35 రోజులు వరకు అవుతుంది. ఈ లెక్కన రవితేజ ఈ సినిమాకి 18కోట్లు అందుకోబోతున్నారు. 

ఈ లెక్కన ఆయన ఎక్కువ షెడ్యూల్‌ ఉన్న సినిమాకి మొత్తంగా 20కోట్లపైనే పారితోషికంగా అందుకోబోతున్నారని చెప్పొచ్చు. దీంతో దర్శక నిర్మాతలు పక్కా ప్లాన్‌ ప్రకారం చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఒక్కో రోజుకి రవితేజకి ఎక్స్ ట్రా యాభై లక్షలు చెల్లించాల్సి వస్తుంది. ఇది సినిమా బడ్జెట్‌పై కూడా ప్రభావాన్ని చూపుతుంది. రవితేజ పారితోషికం కూడా పెరిగిపోతుంది. సినిమా హిట్‌ అయ్యాక పారితోషికం పెంచడమే ట్రెండ్‌కి పుల్‌స్టాప్‌ పెట్టి ఇలా కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తూ భారీ మొత్తంగా పారితోషికంగా అందుకుంటున్నారట రవితేజ. 

ఒక్కో ఏడాది మూడు సినిమాలు చేస్తే మొత్తంగా యాభై నుంచి 60 కోట్ల వరకు పారితోషికం రూపంలో రవితేజ సంపాదించబోతున్నారని చెప్పొచ్చు. జనరల్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు ఇలా రోజువారి పారితోషికం ఉంటుంది. కానీ ఓ స్టార్‌ హీరో ఈ ట్రెండ్‌ని ఫాలో అవడం వల్లే ఆసక్తిగా మారింది. అదే సమయంలో ఈ రూపంలోనే ఎక్కువగా పారితోషికం అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు క్రిటిక్స్. ఈ విషయంలో రవితేజ ఐడియా అదిరిపోయిందనే చెప్పాలి. ఇక రవితేజ ప్రస్తుతం `రామారావుః అన్‌ డ్యూటీ` చిత్రంతోపాటు `ధమాకా`, `రావణాసుర`, `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రాలు చేస్తున్నారు. వరుసగా తననాలుగు సినిమాలతో థియేటర్‌లో సందడి చేయబోతున్నారు.