మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న `మిస్టర్ బచ్చన్‌` సినిమా రిలీజ్‌ డేట్ ని ప్రకటించింది టీమ్‌. ఇది రామ్‌ పోతినేనికి పెద్ద షాక్‌ అనే చెప్పాలి.  

మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం `మిస్టర్ బచ్చన్‌` సినిమాలో నటిస్తున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. రవితేజ ఫ్యాన్స్ కి సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 

`మిస్టర్‌ బచ్చన్‌` సినిమాని ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రిలీజ్‌ చేయబోతున్నారు. అయితే ఆ వారం లాంగ్‌ వీకెండ్‌ ఉండటంతో బాగా కలిసి వస్తుందని టీమ్ భావించి రిలీజ్‌ చేయబోతున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అదే డేట్‌కి ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు బరిలో ఉన్నాయి. వాటికి ఇప్పుడు రవితేజ పెద్ద షాకిచ్చాడు. 

ఇది ఓ రకంగా రామ్‌కి పెద్ద షాకే. ఆయన హీరోగా నటిస్తున్న `డబుల్‌ ఇస్మార్ట్` మూవీని కూడా ఇప్పటికే ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. `పుష్ప2` వాయిదా పడుతుందని తెలిసిన వెంటనే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ఇచ్చేశారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు అదే రోజు ఎన్టీఆర్‌ బామ్మర్ధి నితిన్‌ నార్నే హీరోగా నటిస్తున్న `ఆయ్‌` సినిమా కూడా రిలీజ్‌ కాబోతుంది. వీటితోపాటు విక్రమ్‌ హీరోగా నటించిన డబ్బింగ్‌ మూవీ `తంగలాన్‌` కూడా అదే రోజు రాబోతుంది. మరో చిన్న సినిమా `చిన్న కథ కాదు` కూడా సేమ్‌ డేట్‌కి రాబోతుంది. 

ఇప్పటికే నాలుగు సినిమాలు బరిలో ఉండగా, ఇప్పుడు రవితేజ కూడా సేమ్‌ డేట్‌కి వస్తున్నారు. మొత్తంగా ఆగస్ట్ 15న థియేటర్లలో రచ్చ రచ్చ అవుతుందని చెప్పొచ్చు. మామూలుగా అయితే ఈ డేట్‌కి ఒకటి, రెండు కంటే ఎక్కువ ఆడటం కష్టం. కానీ ఇప్పుడు మాత్రం ఐదు సినిమాలు వస్తున్నాయి. మొత్తంగా రచ్చ చేయబోతున్నాయి. గుంపులో పడి కొట్టుకోబోతున్నాయి. మరి ఇప్పుడే ఐదు ఉంటే, ఇక రిలీజ్‌ డేట్‌ నాటికి ఇంకెన్ని మూవీస్‌ యాడ్‌ అవుతాయో చూడాలి. `మిస్టర్‌ బచ్చన్` సినిమాని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.