హీరో రవితేజ చాలా కాలం తరువాత అందిన బ్లాక్ బస్టర్ హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన సంక్రాంతి చిత్రం క్రాక్ కెరీర్ బెస్ట్ వసూళ్లు రాబట్టింది. పాజిటివ్ టాక్ తో సంక్రాంతి విన్నర్ గా నిలిచిన క్రాక్ రవితేజ హిట్ దాహం తీర్చింది.  క్రాక్ విజయం నేపథ్యంలో రవితేజ రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడన్న టాక్ వినిపిస్తుంది. కాగా రవితేజ ప్రస్తుతం ఖిలాడీ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీలో ఓ కీలక రోల్ కోసం యాక్షన్ కింగ్ అర్జున్ ని తీసుకుంటున్నారట. 

నేడు ఈ విషయాన్ని చిత్ర  యూనిట్ అధికారికంగా తెలియజేశారు.  ఖిలాడీ మూవీ టీంలోకి ఆయనను ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు. ఖిలాడు మూవీలో అర్జున్ చేయనున్న పాత్ర ఏమిటనే విషయంపై స్పష్టత లేదు. ఐతే ఈ  మధ్య అర్జున్ ప్రతి నాయకుడు రోల్స్ కూడా చేస్తున్న నేపథ్యంలో... ఖిలాడీ మూవీలో కూడా విలన్ గా కనిపించే అవకాశం కలదని టాలీవుడ్ టాక్. నితిన్ హీరోగా తెరకెక్కిన లై మూవీలో అర్జున్ విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. 

అర్జున్ ఎంట్రీతో రవితేజ ఖిలాడీపై అంచానాలు మరో స్థాయికి చేరాయి.  దర్శకుడు రమేష్ వర్మ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఖిలాడీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఖిలాడీ ప్రచార చిత్రాలు ఆదరణ దక్కించుకున్నాయి. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నటుడు హవీష్ నిర్మిస్తున్నారు.