కూలబడ్డ ఈగల్... రవితేజకు మరో ప్లాప్!
వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ఈగల్ మొదటి వర్కింగ్ డే చతికిలపడింది. నాలుగో రోజు ఈగల్ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఈగల్ బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అన్న మాట వినిపిస్తోంది.
ధమాకా తర్వాత రవితేజకు హిట్ లేదు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అది చిరంజీవి చిత్రం. ఆ మూవీలో రవితేజ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశాడు. గత ఏడాది ఆయన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు విడుదల చేశారు. రావణాసుర కనీస ఆదరణకు నోచుకోలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన టైగర్ నాగేశ్వరరావు సైతం నిరాశపరిచించి. దాంతో రవితేజ హిట్ కోసం తపిస్తున్నారు.
ఈసారి ఆయన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎంచుకున్నారు. యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో ఈగల్ మూవీ చేశారు. ఈగల్ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. థియేటర్స్ సమస్య కారణంగా ఇతర నిర్మాతల అభ్యర్థన మన్నించి వాయిదా వేశారు. ఫిబ్రవరి 9న ఈగల్ విడుదలైంది. ఈగల్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఆకట్టుకోకపోయినా సెకండ్ హాఫ్ బాగుందనే వాదన వినిపించింది.
ఓపెనింగ్ డే ఈగల్ వసూళ్లు పర్లేదు అనిపించాయి. శని, ఆదివారాల్లో కూడా వసూళ్లు నిలకడగా ఉన్నాయి. వరల్డ్ వైడ్ ఈగల్ మూడు రోజులకు రూ. 15.91 కోట్ల షేర్, రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్లు సమాచారం. అయితే సోమవారం ఈగల్ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. వర్కింగ్ డే వేళ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు.
సోమవారం వసూళ్లు భారీగా పడిపోయాయి. ఈగల్ వరల్డ్ వైడ్ రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మరో ఏడు కోట్ల షేర్ వసూలు చేస్తా కానీ మూవీ విజయం సాధిస్తుంది. ట్రెండ్ చూస్తుంటే ఈగల్ ఆ మార్క్ చేరుకునే అవకాశం లేదు. ఈ క్రమంలో ఈగల్ డిజాస్టర్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోట్లలో నష్టాలు తప్పవు అంటున్నారు.
నెక్స్ట్ వీకెండ్ కొత్త చిత్రాల విడుదల ఉంది. పోటీ మధ్య ఈగల్ వసూళ్లు పుంజుకోవడం జరగని పని. ఈగల్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రోల్ చేసింది. కావ్య థాపర్ మరో హీరోయిన్. నవదీప్, మధుబాల కీలక రోల్స్ చేశారు.