మరో మూడు రోజుల్లో రవితేజ క్రాక్ విడుదల కానుంది. దర్శకుడు గోపి చంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. చిత్ర ట్రైలర్ విడుదల తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. రవితేజ తన ఊర మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టనున్నాడని అర్థం అవుతుంది. చిత్ర విడుదల నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన రవితేజ అనేక విషయాలు పంచుకున్నారు. లాక్ డౌన్ గురించి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. 

లాక్ డౌన్ నాకు సమస్య అనిపించలేదు. దానికి కారణం నేను బయటపెద్దగా తిరగను కాబట్టి అన్నారు. ఎప్పుడూ బయట తిరిగేవారికి లాక్ డౌన్ సమస్య అయ్యిందని, నేను మాత్రం ఇంట్లో సరదాగా గడిపాను అన్నారు. వర్క్ ఔట్స్ చేసుకోవడంతో పాటు, అనేక సినిమాలు చూసినట్లు ఆయన తెలియజేశారు. ఇక కుటుంబంతో సరదాగా గడపడానికి సమయం దొరికిందని రవితేజ అన్నారు. అలాగే సినిమా హిట్టయినా.. ప్లాప్ అయినా జోష్ మాత్రం సేమ్ అని ఆయన తెలియజేయడం జరిగింది. 

ఇక క్రాక్ లో మీ పాత్ర విక్రమార్కుడును పోలి ఉంటుందా అని అడుగగా.. కోర మీసం పెట్టినంత మాత్రానా... విక్రమార్కుడు సినిమాకు క్రాక్ కు ముడిపెట్టలేము అన్నారు. క్రాక్ మరో విభిన్నమైన ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫర్ కథ అన్నారు. ఇక థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులు కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని, మాస్కస్, శానిటైజర్స్ వాడాలని అయన ప్రేక్షకులకు సూచించారు. క్రాక్ మూవీలో సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్స్ గా నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. క్రాక్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.